ఎల్బీ నగర్ ఎస్‌వోటీ, హయత్ నగర్ పోలీసులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి స్థలాలు అమ్ముతున్న ముఠాను పట్టుకున్నారు. అయితే.. దీనికి సంబంధించిన వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. 5గురుని అరెస్ట్ చేసిన వారి నుంచి నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపులు, 9మొబైల్ ఫోన్స్ కారు స్వాధీనం చేసుకున్నామన్నారు. అసలైన యజమాని లేని భూముల డాక్యుమెంట్ కాపీలను రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సేకరిస్తున్నారని, భూమిని ఎక్కువ రోజులు పట్టించుకోని యజమానుల సంతకాలు ఫోర్జరీ చేస్తున్నారని ఆయన వెల్లడించారు.
Also Read : Pawan Kalyan: సన్నాసులారా.. రేణు దేశాయ్ కు నా ఆస్తి మొత్తం రాసిచ్చా
అనంతరం నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి వేరే వాళ్ళకి ఆ భూములు అమ్ముతున్నారని, కేసులో సందీప్ కుమార్ ప్రధాన నిందితుడని, ఇతనిపై గతంలో పలు కేసులు ఉన్నాయని ఆయన వివరించారు. మరో నలుగురితో కలిసి ఈ నేరాలు చేస్తున్నాడని తెలిపారు. అనంతరం సీఐ ఎల్బీ నగర్ ఎస్వోటి సుధాకర్ మాట్లాడుతూ.. కేసులో చంద్రశేఖర్ అనే స్థిరాస్తి మధ్యవర్తి కీలకంగా వ్యవహరిస్తున్నాడని, ఫోటో లేని డాక్యుమెంట్లు సందీప్ కి ఇస్తున్నాడని, వీటిని నెమలిపురి తరుణ్, బొమ్మ రామరావు లతో కలిసి ఇతరులకు విక్రయిస్తున్నాడని, అదే వయస్సున్న వ్యక్తిని యజమానిగా చూపి స్థలాన్ని అక్రమంగా విక్రయిస్తున్నారని ఆయన వెల్లడించారు.