NTV Telugu Site icon

Rachakonda Police: నాలాలోకి దూసుకెళ్లిన కారు.. కుటుంబం మొత్తాన్ని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు..

Car

Car

Rachakonda Police: ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గత రెండు రోజుల్లో నుంచి హైదరాబాద్ మహానగరంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దింతో నగరంలో అనేక చోట్ల వాహనాలకు సంబంధించి చిన్న చిన్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం నాడు రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని వనస్థలిపురంలో ఒక కారు నాలోకి దూసుకువెళ్ళింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి విషయాలు చూస్తే..

Suicide Attempt: అటల్‌ సేతు బ్రిడ్జిపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ మహిళ.. పోలీసుల రాకతో..?

హయత్ నగర్ కు చెందిన జిల్లా వినోద్ తన భార్య పిల్లలతో సహా కుటుంబ సమేతంగా ఎల్బీనగర్ వైపుకు జోరు వాన లో కారులో వెళ్తుండగా.., వనస్థలిపురం పనామా చౌరస్తా దగ్గరకు రాగానే వరద ఉధృతికి కారు అదుపు తప్పి పక్కన ఉన్న వర్షపు నీటి నాలా లోకి దూసుకొని వెళ్ళింది. దాంతో అక్కడే విధుల్లో ఉన్న వనస్థలిపురం ట్రాఫిక్ సి.ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు సైదులు, శ్రీనివాసరావు సంఘటనను గమనించి సమయస్ఫూర్తితో వ్యవహరించి, ఆపద్బంధువుల లాగా కారులో ఉన్న ముగ్గురు చిన్నారులతో సహా కుటుంబం మొత్తాన్ని సురక్షితంగా కాపాడారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన సిబ్బందిని పై అధికారులు అభినందించి, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సిబ్బందికి తగిన సూచనలు చేసినారు. వరద ఉధృతి పూర్తిగా తగ్గిన తర్వాత ట్రాఫిక్ సి.ఐ.లు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రెడ్డిలు భారీ క్రేన్ సహాయంతో నాలాలో ఇరుక్కొన్న కారును కూడా బయటకు తీపించారు.