Site icon NTV Telugu

CP Mahesh Bhagwat : అవార్డులు కైవసం చేసుకున్న రాచకొండ పోలీసులు

Mahesh Bhagwat

Mahesh Bhagwat

Rachakonda police got best police awards

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పతకాలను తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ ఎం భగవత్ సహా 14 మంది పోలీసు అధికారులు కైవసం చేసుకున్నారు. సీపీ మహేశ్‌ భగవత్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎన్‌సీ) ఇంటెలిజెన్స్ సెల్ దేవేందర్ సింగ్ ప్రతిభావంతులైన సేవకు రాష్ట్రపతి పోలీసు పతకాన్ని పొందారు. వీరితో పాటు మరో 12 మంది పోలీసు అధికారులు పోలీసు పతకాలను కైవసం చేసుకున్నారు. 12 మంది అధికారులు డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ జాయింట్ కమీషనర్ ఏఆర్ శ్రీనివాస్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) పాలేరు సత్యనారాయణ, ఎస్‌ఐబీ ఏఎస్పీ పైళ్ల శ్రీనివాస్, సెంట్రల్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయిని శ్రీనివాస్ రావు, అవినీతి నిరోధక శాఖ (ACB) డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) సూరాడ వెంకట రమణ మూర్తి, ISW DSP చెరుకు వాసుదేవ రెడ్డి, టీఎస్‌ పోలీస్ అకాడమీ డీఎస్పీ గంగిశెట్టి గురు రాఘవేంద్ర, రామగుండం సబ్-ఇన్‌స్పెక్టర్ చిప్ప రాజమౌళి, రాచకొండ స్పెషల్ బ్రాంచ్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాట్రగడ్డ శ్రీనివాసులు, కామారెడ్డి రిజర్వ్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ARSI) జంగన్నగారి నీలం రెడ్డి, తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ మమ్నూర్ నాల్గవ బెటాలియన్ ఎఆర్‌ఎస్సై సలేంద్ర సుధాకర్ తో పాటు కరీంనగర్ ఇంటెలిజెన్స్ డీఎస్పీ ఆఫీసు హెడ్ కానిస్టేబుల్ ఉందింటి శ్రీనివాస్‌లు అవార్డులు సాధించారు.

 

Exit mobile version