NTV Telugu Site icon

WIPL 2023: గుజరాత్ జెయింట్స్ హెడ్ కోచ్‌గా స్టార్ క్రికెటర్

Fsd

Fsd

విమెన్స్ ఐపీఎల్ కోసం ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. టీమ్‌లో ఎవరిని తీసుకోవాలనే దానికంటే ముందు సపోర్ట్ స్టాఫ్‌పై దృష్టి సారించాయి. ఇందులో గుజరాత్ జెయింట్స్ ఓ అడుగు ముందే ఉంది. ఇప్పటికే టీమిండియా లెజెండరీ క్రికెటర్ మిథాలీ రాజ్‌ను టీమ్ మెంటార్‌గా నియమించిన గుజరాత్‌.. తాజాగా హెడ్‌ కోచ్‌తో పాటు బ్యాటింగ్, బౌలింగ్ కోచ్ ఎవరన్నది వెల్లడించింది. ఈ జట్టు ప్రధాన కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్ రేచల్ హేన్స్‌ను నియమించింది. అదే విధంగా తుషార్ అరోథేను బ్యాటింగ్‌ కోచ్‌గా, భారత మాజీ స్పిన్నర్ నూషిన్ అల్ ఖదీర్‌ను బౌలింగ్ కోచ్‌గా గుజరాత్‌ ఎంపికచేసింది.

Also Read: INDvsAUS Test: అది ఆస్ట్రేలియా మైండ్‌గేమ్.. స్మిత్‌కు అశ్విన్ కౌంటర్

కాగా, మొదటి అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా నూషిన్ అల్ ఖదీర్‌ పని చేశాడు. అతడి నేతృత్వంలోనే భారత జట్టు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించింది. ఇక ఈ ముగ్గురు గుజరాత్‌ జెయింట్స్‌ మెంటార్‌ మిథాలీ రాజ్‌తో కలిసి పనిచేయనున్నారు.

Also Read: Deepak Chahar Wife: దీపక్ చాహర్ భార్యను మోసం చేసిన వ్యక్తులు..రూ.10లక్షల కోసం

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌ జట్టులో చాలా కాలం పాటు కీలక సభ్యురాలిగా కొనసాగింది రేచల్ హేన్స్. అదే విధంగా ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టులో హేన్స్‌ భాగంగా ఉంది. ఆమె ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు 6 టెస్టులు, 77 వన్డేలు, 84 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించింది. హేన్స్‌ 77 వన్డేల్లో 2,585 పరుగులు చేసింది. అందులో 19 అర్ధ సెంచరీలతో పాటు రెండు సెంచరీలు కూడా ఉన్నాయి.