Site icon NTV Telugu

Rabies Virus: కుక్క మాత్రమే కాదు.. వీటిల్లో ఏది కరిచినా రేబిస్ వస్తుంది!

Rabies Animals

Rabies Animals

THese 10 Animals That Can Spread Rabies: సాధారణంగా మనకు కుక్క కరిస్తేనే ‘రేబిస్’ వ్యాధి వస్తుంది అనుకుంటాం. కానీ అది నిజం కాదు. కుక్కలతో పాటు మరికొన్ని జంతువులు కరిచినా రేబిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. రేబిస్ అనేది ఒక ప్రమాదకరమైన వైరల్ వ్యాధి. ఇది సాధారణంగా జంతువుల కాటు ద్వారా మానవులకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి మెదడు, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సరైన సమయంలో చికిత్స చేయకపోతే.. ప్రాణాంతకం కావచ్చు. రేబిస్ బారిన పడే వారిలో ఎక్కువ మంది కుక్క కాటుకు గురైన వారే ఉంటారు. అందుకే వీధి, పెంపుడు కుక్కల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుక్క కాటుకు గురైన వెంటనే వ్యాక్సిన్‌లు వేయించుకోవాలి.

రేబిస్‌కు కుక్కకాటు మాత్రమే కారణం కాదు. ఇతర జంతువుల నుంచి కూడా రేబిస్ వ్యాధి సోకుతుంది. ఈ క్రమంలో రేబీస్ వ్యాధిని కలిగించే 10 జంతువులు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అడవి లేదా వీధి పిల్లులు రేబిస్‌ వైరస్‌ను కలిగి ఉండవచ్చు. వాటి కాటు లేదా గోకడం ద్వారా వ్యాధి సంక్రమించవచ్చు. రేబిస్‌ వైరస్‌ను వ్యాప్తి చేసే ప్రధాన జంతువులలో గబ్బిలాలు కూడా ఉన్నాయి. తోడేళ్లు కూడా రేబిస్‌ వైరస్‌ను వ్యాప్తి చేయగలవు. వీటి కాటు లేదా గోకడం ద్వారా వ్యాధి మానవులకు సంక్రమించే అవకాశం ఉంది. ఎలుకలు సాధారణంగా రేబిస్‌ వ్యాప్తి చేయవని భావించినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో వీటి కాటు ద్వారా వ్యాధి సంక్రమించవచ్చు. ముఖ్యంగా అడవి ఎలుకలు.

Also Read: Crime News: కుండలో బంగారు నాణేలు దొరికాయని.. రూ.20 లక్షలు టోకరా! చివరికి ఏమైందంటే?

గ్రౌండ్‌హాగ్స్ కూడా రేబిస్‌ వైరస్‌ను కలిగి ఉండవచ్చు. ఇవి సాధారణంగా ఉత్తర అమెరికాలో కనిపిస్తాయి. వీటి కాటు చాలా ప్రమాదకరం. రేబిస్‌ నివారణకు పెంపుడు జంతువులకు రేబిస్‌ టీకాలు వేయించడం చాలా ముఖ్యం. ఏదైనా జంతువు కాటు వేసిన వెంటనే.. గాయాన్ని సబ్బుతో శుభ్రం చేసి, వైద్య సలహా తీసుకోవాలి. రేబిస్‌ టీకా, ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్‌లు సకాలంలో తీసుకోవడం ద్వారా వ్యాధిని నివారించవచ్చు. ఈ కాలంలో ఏ జంతువు కరిచినా వెంటనే డాక్టర్లను కలవడం మంచిది.

Exit mobile version