NTV Telugu Site icon

Rabbit Farming: కుందేళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Rabitt

Rabitt

రైతులు ఇటీవల కుందేళ్ల పెంపకం కూడా చేస్తున్నారు.. గ్రామాల్లో ఉండేవాళ్ళు ఎక్కువగా వీటిని పెంచవచ్చు.. వీటికి ఎక్కువ స్థలం కూడా అవసరం లేదు.. కేవలం తక్కువ ఖర్చుతో వీటిని పెంచవచ్చు.. మాంసం కొరకే కాకుండా ఉన్ని కొసం కుందేళ్లను పెంచుతున్నారు. ఈ పరిశ్రమ లాభసాటి ప్రస్తుతం లాభసాటి ఉంది. కుందేళ్ల వెంట్రుకలతో తయారైన వస్తువులను ఎగుమతి చేస్తున్నారు. దీని మాంసంలో అధిక పోషకవిలువలు కలిగి ఉండటంతో మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే.. వీటి పెంపకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ కుందేళ్లు రెండు రకాల కుందేళ్ల ను పెంచుతారు. ఉన్ని కోసం పెంచే వాటిని అంగోరా కుందేళ్లు అంటారు. మాంసం కోసం పెంచే వాటిని బ్రాయిలర్‌ కుందేళ్లు అంటారు.. అంగోరా జాతిలో విభిన్న రకాలు ఉన్నాయి. బ్రిటీష్‌ అంగోరా, జెర్మన్‌ అంగోరా, రష్యన్‌ అంగోరా మొదలగునవి. న్యూజిలాండ్‌ వైట్‌, సోవియట్‌ చించిల్లా, ఫ్లెమిష్‌ జైంట్‌, గ్రేజైంట్‌, కాలిఫోర్నియన్‌ వైట్‌ జాతికి చెందిన కుందేళ్లు మన వాతావరణంలో పెంచుకోవడానికి సులువుగా ఉంటాయి..

ఇక ఇవి బాగా పెరగాలంటే సొంతంగా రైతులు గడ్డిని పెంచాలి.. పప్పుజాతి పశుగ్రాసాలైన లూసర్న్‌, బర్సీమ్‌ తప్పకుండా ఇవ్వవలెను.. ప్రతి కుందేలు 300 గ్రాముల మేత తీసుకుంటుంది.. ఒక లీటర్ నీటిని తీసుకుంటుంది.. కుందేళ్లకు ఇచ్చే దాణాలో పలు పోషక పదార్థాలుండాలి. మాంసకృత్తులు 17 శాతం ఉండునట్లు చూసుకోవాలి. పిండిపదార్థాలు, కొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఉండేలా చూసుకోవాలి.. కుందేలు మాంసంలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటంతో ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు.. అంతేకాదు కుందేళ్ల పేడలో అధిక పాళ్లలో నత్రజని, భాస్వరం ఉండటం వల్ల పెరటి తోటల్లో పూలు, పండ్లు, కూరగాయలను పెంచడానికి సేంద్రియ ఎరువుగా వాడవచ్చును. కుందేళ్లు తెల్లని మాంసాన్ని ఉత్పత్తి చేస్తాయి. అంతేకాకుండా కుందేలు మాంసంలో సోడియం, పొటాషియం లు అధిక శాతంలో వుంటాయి.. తక్కువ ఖర్చు వీటిని పెంచవచ్చు..