Site icon NTV Telugu

Raayan: ‘రాయ‌న్’ నుంచి ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేసిందోచ్.. మాస్ లుక్ లో ధనుష్..

Raayan

Raayan

సొంత ద‌ర్శ‌క‌త్వంలో కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన సినిమా ‘రాయ‌న్‌’. అపర్ణ బాలమురళి, దుషార విజయన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, విష్ణు విశాల్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్, ఎస్.జె. సూర్యలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నార్త్ మద్రాస్ నేపథ్యంలో సాగే యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని, దీనికి ఏ ఆర్ రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నారని తెలుస్తోంది.

Also Read: Lucky Boy: కాస్త ఆలస్యమైనా పిల్లడు ఉండేవాడు కాదు.. వైరల్ వీడియో..

ధనుష్ కెరీర్‌లో 50వ సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. జూన్ 13న ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ బృందం తమ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ చిత్రంలోని తొలి పాటను విడుదల చేశారు.

Also Read: Minor Case: మైనర్‌పై జరిగిన రేప్ కేసులో కోర్టు సంచలన తీర్పు..

ఈ పాటను ఎ.ఆర్. రెహమాన్.. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు. ఇదంతా తమిళంలో ‘అడంగాత అసురన్’, తెలుగులో ‘తలవంచి ఎరగాడే’, హిందీలో ‘కోయ్ తోడ్ నా ఇస్కా’తో మొదలైంది. తమిళ వెర్షన్ పాటను ధనుష్ స్వయంగా కంపోజ్ చేశారు. ప్రభుదేవా నృత్యం సమకూర్చారు. ఈ పాట చాలా బాగుండడంతో.. నెట్టింట ఇప్పుడు వైరల్‌గా మారింది.

Exit mobile version