Site icon NTV Telugu

Raakshasa Kaavyam : రాక్షస కావ్యం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Whatsapp Image 2023 12 12 At 3.11.03 Pm

Whatsapp Image 2023 12 12 At 3.11.03 Pm

సరికొత్త కథాంశం తో తెరకెక్కిన రాక్షస కావ్యం మూవీ అక్టోబర్ 13వ తేదీన  థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్‍ వచ్చినా కూడా ఈ మూవీ ఆశించిన స్థాయిలోకలెక్షన్లను రాబట్టలేకపోయింది. రాక్షస కావ్యం సినిమాలో అభయ్ నవీన్ బేతినేని, అన్వేష్ మైకేల్ మరియు కుశాలిని ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయింది. రాక్షస కావ్యం సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ తాజాగా ఖరారైంది.రాక్షస కావ్యం సినిమా డిసెంబర్ 15వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా వెల్లడించింది. “కాలం రాసిన రాక్షస కావ్యం. డిసెంబర్ 15న ఆహాలో” అని ఆహా నేడు ట్వీట్ చేసింది.రాక్షస కావ్యం చిత్రానికి శ్రీమాన్ కీర్తి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అభయ్ నవీన్, అన్వేష్ ప్రధాన పాత్రలు చేయగా.. దయానంద్ రెడ్డి, పవన్ రమేశ్, యాదమరాజు ముఖ్య పాత్రల్లో నటించారు.

రాక్షస కావ్యం చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్ మరియు సినీ వ్యాలీ మూవీస్ పతాకాలపై దామురెడ్డి మరియు సింగనమల కల్యాణ్ నిర్మించారు. ఈ చిత్రానికి రాజీవ్ రాజ్, శ్రీకాంత్ సంగీతం అందించారు. రుషి కోనాపురం సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.రాక్షస కావ్యం సినిమా మొత్తం ముఖ్యంగా అజయ్ (అభయ్ నవీన్), విజయ్ (అన్వేష్ మైకేల్) చుట్టూ నడుస్తుంది..అజయ్‍ సుపారీ తీసుకొని హత్యలు చేసే కాంట్రాక్ట్ కిల్లర్‌గా ఉంటాడు. మరోవైపు, విజయ్‍కు మాత్రం సినిమాలు తెరకెక్కించాలనే కోరిక ఉంటుంది. వెరైటీగా విలన్ క్యారెక్టర్ ను హైలైట్ చేస్తూ మూవీస్ తీయాలని విజయ్ ఆలోచిస్తుంటాడు. అయితే, అజయ్, విజయ్ మధ్య వైరం ఉంటుంది. అసలు అజయ్, విజయ్ మధ్య వున్న సంబంధం ఏంటి. వారిఇద్దరి మధ్య వైరానికి కారణమేంటి.. అస్సలు చివరికి ఏమవుతుంది.అన్నదే రాక్షస కావ్యం ప్రధాన కథగా ఉంది. కథ పరంగా చూస్తే ఈ సినిమా ఎంతో కొత్తగా అనిపిస్తుంది. అయితే, కథనం మాత్రం ప్రేక్షకులను కాస్త నిరాశ పరిచిందనే ప్రేక్షకుల నుండి టాక్ వచ్చింది.అయితే థియేటర్స్ లో ఆకట్టుకోని రాక్షస కావ్యం ఓటీటీ ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి.

Exit mobile version