Site icon NTV Telugu

Raakasa: ట్రెండీ లిరిక్స్‌తో ‘రాకాస’ ఫస్ట్ సింగిల్.. రామ్ మిర్యాల ‘రపప్పా.. రపప్పా’ పాట విన్నారా?

Rapappa

Rapappa

Raakasa: ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల ఎన్నో అవార్డుల్ని, రివార్డుల్ని అందుకున్నారు. అలాంటి ఓ అద్భుతమైన సినిమా తరువాత జీ స్టూడియోస్ స‌మ‌ర్పణలో నిహారిక త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత‌గా ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ కాబోతుంది. ఇటీవల రిలీజ్ చేసిన ‘రాకాస’ గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక చిత్ర బృందం తాజాగా ‘రపప్పా.. రపప్పా’ అంటూ సాగే పాటను విడుదల చేసింది.

READ ALSO: Iran War: ఇరాన్ “పాలన మార్పు”‌పై అమెరికా ఇంటెలిజెన్స్ సంచలన నివేదిక..

హీరోయిన్ పట్ల హీరోకి ఉన్న ప్రేమ, తనకి బదులుగా వేరే వాడ్ని పెళ్లి చేసుకుంటోన్న తరుణంలో హీరోయిన్ గురించి హీరో చెప్పడం, తన బాధను వివరించడం ఈ పాటలో కనిపిస్తోంది. ఆ బాధని కూడా ట్రెండీ పదాలతో, చాలా ఫన్నీగా చెప్పే ప్రయత్నం చేశారు మేకర్స్. అనుదీప్ దేవ్ అందించిన బాణీ, రఘురాం సాహిత్యం, రామ్ మిర్యాల గాత్రం ఈ పాటను మరింత స్పెషల్‌గా మార్చేశాయి. ఈ మూవీ ఆడియో హక్కుల్ని సరిగమ సంస్థ సొంతం చేసుకుంది. ఈ సినిమాని ఓవర్సీస్‌లో అథర్వణ భద్రకాళి పిక్చర్స్, కెనడాలో ప్రత్యంగిరా సినిమాస్ భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు.

READ ALSO: Redeveloping Colonies: సొంత నిధులతో కొత్త భవనాలు.. ఢిల్లీలో 7 ప్రభుత్వ కాలనీలకు కొత్త కళ..

Exit mobile version