Raaka : దీపికా డెడికేషన్ కు యూనిట్ ఫిదా.. రూమర్స్ పై మేకర్స్ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ప్రస్తుతం గర్భవతి అన్న సంగతి తెలిసిందే. ఆమె రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ఆమె నటిస్తున్న భారీ చిత్రం ‘రాకా’లో దీపికా పాత్రను తగ్గిస్తున్నారని లేదా ఆమె స్క్రీన్ టైమ్ మారుస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ వార్తలను చిత్ర యూనిట్ ఖండించింది.
దీపికా పదుకొనె గర్భం దాల్చినప్పటికీ సినిమా షెడ్యూల్‌లో గానీ ఆమె పాత్ర నిడివిలో గానీ ఎలాంటి మార్పులు చేయడం లేదని మేకర్స్ స్పష్టం చేశారు. షూటింగ్ పనులు ప్రస్తుతం చాలా సాఫీగా సాగుతున్నాయని, ఆమె మునుపటి ప్లానింగ్ ప్రకారమే సెట్స్‌కు హాజరవుతున్నారని తెలిపారు. దీపికా పట్ల గౌరవంతో షూటింగ్ వాతావరణం ఆమెకు అనుకూలంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ సినిమాలో దీపికా కొన్ని పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాల్లో నటించాల్సి ఉంది. దీని కోసం చిత్ర యూనిట్ ప్రత్యేక సేఫ్టీ మెజర్స్ పాటిస్తోంది. గర్భిణీగా ఉన్నప్పటికీ దీపికా డెడికేషన్ కు టీమ్ మొత్తం ఫిదా అవుతోంది. యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ సమయంలో దీపికకు ఏమాత్రం శ్రమ కలగకుండా స్టంట్ మాస్టర్స్ మరియు దర్శకుడు అట్లీ పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు.ప్రస్తుతానికి అంతా అనుకున్నట్లుగానే జరుగుతున్నా సినిమా భారీ బడ్జెట్‌తో కూడుకున్నది కావడంతో భవిష్యత్తులో షెడ్యూల్స్ ఏవైనా మారితే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అల్లు అర్జున్ – అట్లీ వంటి క్రేజీ కాంబోలో వస్తున్న ఈ చిత్రాన్ని మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారట.
Also Read
- West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
- Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్... మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
తాజావార్తలు
-
ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
-
AFG vs IND 1st T20: అఫ్గానిస్థాన్‌తో మొదటి టీ20.. అందుకే వైభవ్ సూర్యవంశీ ఆడడం లేదు!
-
West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?