NTV Telugu Site icon

Kohli vs Rohit: కోహ్లీ, రోహిత్ మధ్య గొడవలు నిజమే: మాజీ కోచ్ శ్రీధర్

R

R

టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య మనస్పర్థలు వచ్చాయిని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. తాజాగా టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ఈ విషయంపై ఓపెన్ అయ్యాడు. వారిద్దరి మధ్య స్వల్ప విభేదాలున్న మాట వాస్తమేనని చెప్పాడు. ధోనీ రిటైర్ అయ్యాక ఆ గొడవలు ఎక్కువయ్యాయని తెలిపాడు. వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదం, అప్పటి కోచ్ రవిశాస్త్రి ఈ సమస్యను ఎలా పరిష్కరించాడనే విషయాన్ని తన ఆటో బయోగ్రఫీ కోచింగ్ బియాండ్ – మై జర్నీ విత్ ది ఇండియన్ క్రికెట్ టీమ్‌లో రాసుకొచ్చాడు ఆర్ శ్రీధర్.

Also Read: Italy: ఇటాలియన్ మాఫియా డాన్.. 16 ఏళ్లుగా పిజ్జా చెఫ్‌గా పని.. ఫేస్‌బుక్ పోస్టుతో పట్టుబడ్డాడు..

“2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం గురించి చాలా చర్చ జరిగింది. రోహిత్, కోహ్లీ ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో అయ్యారు. విరాట్ క్యాంపు, రోహిత్ క్యాంపు అని టీమ్‌లో రెండు సెపరేట్ గ్రూపులు కూడా ఉండేవి. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ కోసం యూఏఈ వెళ్లాం. అక్కడికి వెళ్లగానే రవిశాస్త్రి, విరాట్ , రోహిత్‌ను తన రూమ్‌కు పిలిపించుకున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని అనుకున్నాడు. ‘సోషల్ మీడియాలో ఏం జరిగిందో వదిలేయండి.. మీరు ఇద్దరూ టీమ్‌లో సీనియర్ క్రికెటర్లు.ధోనీ రిటైర్ అయ్యాక ఇప్పుడు మీరు ఇద్దరూ టీమ్‌లో మిగిలిన వారికి రోల్ మోడల్‌గా ఉండాలి. మీ మధ్య ఏమున్నా అవన్నీ పక్కనబెట్టేసి కలిసి ముందుకు వెళ్లాలని నేను అనుకుంటున్నా..’ అని తేల్చి చెప్పేశాడు. ఆ తర్వాత ఇద్దరిలోనూ మార్పు వచ్చింది. నవ్వుతూ పలకరించుకోవడం, మాట్లాడుకోవడం మొదలెట్టారు.ఇద్దరూ తమ సమస్య ఏంటో కూడా చెప్పలేదు. ఒకరి మీద ఒకరు కంప్లైట్స్ ఇచ్చుకోలేదు. కొత్తగా మొదలెట్టాలని చేతులు కలిపారు. ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు.. అన్నింటికి ముందు టీమ్.. రవిశాస్త్రి నమ్మింది ఇదే..” అని శ్రీధర్ చెప్పాడు.

Also Read: BBL 2023: టర్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌..బిగ్‌బాష్ లీగ్ విజేతగా పెర్త్ స్క్రాచర్స్

కాగా, 2020 ఐపీఎల్ అయ్యాక టీమిండియా నేరుగా దుబాయ్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లింది. అయితే రోహిత్ మాత్రం ఇండియాకు తిరిగి వచ్చాడు. రోహిత్ ఎందుకు రాలేదో కూడా తనకి తెలియదని విరాట్ కోహ్లీ ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో కామెంట్ చేయడం అప్పట్లో పెను దుమారం రేపింది. కోహ్లీ టీ20, వన్డే సిరీస్‌లు ఆడి ఆడిలైడ్ టెస్టు ముగిశాక పెటర్నిటీ లీవ్ కింద స్వదేశానికి తిరిగి వచ్చాడు. కోహ్లీ ఇటు వచ్చాక రోహిత్ ఆస్ట్రేలియాకి వెళ్లాడు. చివరి రెండు టెస్టుల్లో ఆడి ఆ మ్యాచులకు వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఈ ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి వెళ్లాయని, ఐపీఎల్‌కి ముందు ఇంగ్లాండ్‌పై టెస్టు సిరీస్ గెలిచాక రవిశాస్త్రి ఇచ్చిన పార్టీ ఫోటోలు బయటికి వచ్చేదాకా తీవ్రంగా ప్రచారం జరిగింది.

Show comments