టీమిండియా మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుత తరం క్రికెటర్లలో తన ఫెవర్టిట్ ‘ఫ్యాబ్-5’ (అద్భుతమైన ఐదుగురు) బ్యాటర్లను ఎంపిక చేశారు. ఈ జాబితాలో కోహ్లీ, జో రూట్ వంటి దిగ్గజాలకు చోటు కల్పించలేదని, ఇది కొంచెం భిన్నమైన ఎంపిక అని ఆయన స్పష్టం చేశారు. ఈ జాబితాలో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ దేశాల ఆటగాళ్లు ఉన్నారు.
అశ్విన్ ఎంచుకున్న ఈ ఐదుగురిలో ఒకరిని మినహాయిస్తే మిగతా అందరూ తమ దేశ జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తుండటం విశేషం. ఈ జాబితాలో మొదటి స్థానంలో భారత యువ బ్యాటర్ శుభమన్ గిల్ నిలిచారు. ప్రస్తుతం గిల్ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు. అంతేకాకుండా ఆయన భారత్ తరఫున టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
రెండో ఆటగాడిగా ఇంగ్లండ్ పవర్ హిట్టర్ హ్యారీ బ్రూక్ పేరును అశ్విన్ సూచించారు. ప్రస్తుతం బ్రూక్ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్నారు. అలాగే ఇంగ్లండ్ టీ20, వన్డే జట్లకు కూడా ఆయనే నాయకత్వం వహిస్తున్నారు. మూడో ఆటగాడిగా ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ నిలిచారు. ఈ జాబితాలో కెప్టెన్సీ లేని ఏకైక ఆటగాడు హెడ్ మాత్రమే కావడం గమనార్హం.
నాలుగో స్థానంలో వెస్టిండీస్ స్టార్ షై హోప్ను అశ్విన్ ఎంపిక చేశారు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్న హోప్, పరిమిత ఓవర్ల క్రికెట్లో విండీస్ వన్డే, టీ20 జట్లకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. ఇక ఐదవ , చివరి ఆటగాడిగా సౌతాఫ్రికా టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ తెంబా బావుమాను అశ్విన్ ఎంచుకున్నారు. బావుమా టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తున్నారని, ఆయన సారథ్యంలో సౌతాఫ్రికా అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రశంసించారు. సౌతాఫ్రికా జట్టు రాబోయే వన్డే ప్రపంచ కప్లో బావుమా ఆధ్వర్యంలో ఎలా రాణిస్తుందో చూడాలని ఆసక్తిగా ఉందని అశ్విన్ తెలిపారు.

