Site icon NTV Telugu

Telangana: రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ గణపతిరెడ్డి రాజీనామా

Ganapathi Reddy

Ganapathi Reddy

Telangana: రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ గణపతి రెడ్డి రాజీనామా చేశారు. గత పదేళ్లుగా ఆర్ అండ్ బీ ఈఎన్సీగా పని చేసిన గణపతి రెడ్డి.. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు తెలిపారు. టిమ్స్‌ ఆస్పత్రి అంచనాల పెంపుపై విజిలెన్స్ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆరోపణల నేపథ్యంలోనే గణపతి రెడ్డి రాజీనామా చేసినట్లు సమాచారం. తన రాజీనామా లేఖను ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌ రాజ్‌కు గణపతి రెడ్డి అందజేశారు. 2017లోనే గణపతి రెడ్డి రిటైర్‌మెంట్ అయినా ఏడేళ్లు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొనసాగించింది. ప్రస్తుతం ఉన్న రేవంత్ సర్కారు కూడా గత తొమ్మిది నెలలుగా ఈఎన్సీగా గణపతి రెడ్డిని కొనసాగించింది. వరంగల్ మల్టీ సూపర్‌ స్పెషలిటీ ఆస్పత్రి, హైదరాబాద్‌లోని టిమ్స్‌ ఆస్పత్రుల అంచనాల పెంపుపై విజిలెన్స్‌ విచారణ కొనసాగుతున్న వేళ గణపతి రెడ్డి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ బాధ్యతలను గణపతి రెడ్డి చూస్తున్నారు.

Read Also: CM Revanth Reddy: చెరువుల ఆక్రమణలపై రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్

 

Exit mobile version