దీపావళి పండగ రోజు టపాకాయలు కాల్చి ఎంజాయ్ చేస్తుంటారు. పెద్దవాళ్లు కూడా చిన్న పిల్లల్లా మారి బాణసంచా కాలుస్తుంటారు. ఇక చిన్న పిల్లల సంగతి చెప్పాల్సిన పనిలేదు. తల్లిదండ్రులను బ్రతిమిలాడుకుని మరి టపాసులు కొనుక్కొచ్చుకుని కాలుస్తుంటారు. అయితే ఈ బాణసంచా కాల్చే సమయంలో అజాగ్రత్తగా ఉండడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. చేతిలో పేలడం, కళ్లల్లో పడడంతో గాయాలపాలవుతున్నారు. ఏటా దీపాల పండుగ రోజున టపాసులు కాల్చే సమయంలో ఆనందాలతో పాటు విషాదాలూ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం కంటి గాయాలతో ఆస్పత్రులకు కొంత మంది క్యూ కడుతూ ఉంటారు.
Also Read:Vijay Devarakonda : కారులోనే శృంగారం చేశా.. విజయ్ షాకింగ్ కామెంట్స్
ఈసారి కూడా అలాగే జరిగింది. దీపావళి సందర్భంగా బాణసంచా కాలుస్తూ కొంత మంది ప్రమాదానికి గురి అయ్యారు. హైదరాబాద్‌లో టపాసులు కాల్చుతూ గాయపడ్డవారు మెహెదీపట్నంలోని సరోజినీ దేవీ కంటి హాస్పిటల్ కి వరుస కట్టారు. ఒక్క సరోజినీ దేవి ఆస్పత్రికి ఇప్పటివరకు మొత్తం 10 మంది గాయపడిన వారు వచ్చారని.. వారికి తగిన చికిత్స చేసినట్లుగా సరోజినీదేవీ కంటి ఆసుపత్రిలో ఆర్.ఎం.ఓ డాక్టర్ ఇబ్రహీం వెల్లడించారు. వారిలో 7 మంది చిన్నపిల్లలు ఉన్నారని చెప్పారు. మరిన్ని కేసులు వచ్చినా ట్రీట్మెంట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని ఆర్.ఎం.ఓ డాక్టర్ ఇబ్రహీం తెలిపారు.
