NTV Telugu Site icon

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌పై ప్రశ్న.. 1.60 లక్షలు గెలుచుకున్న కంటెస్టెంట్‌!

Pawan Kalyan

Pawan Kalyan

KBC Question on Pawan Kalyan: బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్‏గా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ 16వ సీజన్ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ షోలో భాగంగా ఇటీవలి ఎపిసోడ్‌లో ఒలింపిక్స్‌పై ప్రశ్నను అడిగిన బిగ్‌బీ.. తాజాగా పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు సంబందించిన ప్రశ్నను అడిగారు. అయితే కంటెస్టెంట్‌ ఈ ప్రశ్నకు ‘ఆడియన్స్‌ పోల్‌’ ఆప్షన్‌ తీసుకుని.. 1.60 లక్షలు గెలుచుకున్నాడు. ఇంతకీ అమితాబ్ ఏం ప్రశ్న అడిగారో తెలుసా?.

‘2024 జూన్‌లో ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు ఆదుకున్న నటుడు ఎవరు?’ అని కంటెస్టెంట్‌ను అమితాబ్ బచ్చన్ అడిగారు. ఆప్షన్‌లో పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణల పేర్లను ఇచ్చారు. ఈ ప్రశ్నకు కంటెస్టెంట్‌కు సమాధానం తెలియక.. ‘ఆడియన్స్‌ పోల్‌’ తీసుకున్నాడు. ఆడియన్స్‌లో 50 శాతం మందికి పైగా పవన్‌ కల్యాణ్‌ అని సమాధానం ఇచ్చారు. దీంతో పవన్‌ పేరును కంటెస్టెంట్‌ లాక్‌ చేశాడు. సరైన సమాధానం కావడంతో కంటెస్టెంట్‌ రూ.1.60 లక్షలు గెలుచుకున్నాడు. తర్వాత సదరు కంటెస్టెంట్‌కు పవన్ గురించి బిగ్‌బీ వివరాలు చెప్పారు.

Also Read: Raveena Tandon: సారీ.. నేను అలా చేసుండకూడదు: రవీనా టాండన్‌

‘పవన్ కళ్యాణ్ అద్భుత నటుడు. మెగాస్టార్ చిరంజీవి చిన్న తమ్ముడు. పవన్ జనసేన పార్టీ పెట్టారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు’ అని కంటెస్టెంట్‌కు పవన్ కళ్యాణ్ గురించి అమితాబ్ బచ్చన్ చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రశ్న, అమితాబ్ వివరణకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పవన్ ఫ్యాన్స్, జనసైనికులు ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్.. భారీ మెజారితో గెలిచిన విషయం తెలిసిందే. జనసేన నుంచి పోటీ చేసిన ప్రతి ఒక్కరూ విజయం సాధించడంతో.. 21 ఎమ్మెల్యేలు, రెండు ఎంపీ స్థానాలను సొంతం చేసుకున్నారు.

Show comments