Site icon NTV Telugu

RS Praveen Kumar: బీఎస్పీకి తెలంగాణలో డబుల్‌ డిజిట్‌ పక్కా..

Rs Praveen Kumar

Rs Praveen Kumar

RS Praveen Kumar: బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌తో ఎన్టీవీ క్వశ్చన్‌ అవర్‌లో పాల్గొన్నారు. అధికారిగా ఉన్నప్పుడు చాలా పరిమితులు ఉంటాయని.. రాజకీయాల్లో ఉంటే పరిమితులు ఉండవన్నారు. ఖాకీ, ఖద్దరు రెండు బాగానే ఉన్నాయని ఈ సందర్భంగా చెప్పారు. కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా మాత్రమే చూశాను.. ఇంద్రుడు, చంద్రుడు అని ఎప్పుడూ పొగడలేదన్నారు. కేసీఆర్‌ను ఎప్పుడూ దూషించలేదన్నారు. కేసీఆర్‌ నిర్ణయాలు ప్రజలకు నష్టపరిచేలా ఉంటాయ్నారు. కేసీఆర్‌పై పగ, ప్రతీకారాలు లేవని ఆయన చెప్పారు. మావోయిస్టుల లేఖ వెనుక తానే ఉన్నారన్నది అవాస్తవమన్నారు. కోనేరు కోనప్ప తనపై తప్పుడు కేసులు పెట్టించారన్నారు. ఎందరో సాయుధ నక్సలైట్లను అడవుల్లోనుంచి బయటకు తీసుకొచ్చాను.. ఎన్‌కౌంటర్‌ ప్రవీణ్‌కుమార్‌ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ చెప్పుకొచ్చారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసి ఉంటే జైల్లో ఉండాల్సి వచ్చేదన్నారు. 25 ఏళ్ల తర్వాత నాపై ఒక్క మచ్చ కూడా లేదన్నారు.

Also Read: Revanth Reddy: నేను ఇక్కడికి వస్తున్నానని కేసీఆర్ కొడంగల్ పోయిండు..

మన గుర్తింపే మన భవిష్యత్‌ ను నిర్ణయిస్తుందని నమ్మాను.. అందుకే గురుకులాలకు వచ్చానని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. స్వేరో అంటే ఆకాశమే హద్దుగా ఉండాలని పిల్లలకు 10 కమాండ్స్‌ నేర్పించాను.. నేను పేదపిల్లలకు ఇంగ్లీషు నేర్పించడం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు నచ్చలేదన్నారు. అందుకే అప్పటి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారన్నారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ..” పరిటాల కేసును సీబీఐ ఇన్వెస్ట్‌ చేసింది.. నాకు సంబంధం ఉంటే నన్ను జైల్లో పెట్టాలి కదా.. పరిటాల ప్రాణాలకు ప్రమాదం ఉందని అప్పటి డీజీపీకి లెటర్‌ పంపాను.. ఈ విషయంలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సింది.. నాకు, కేసీఆర్‌కు గ్యాప్‌ రాలేదు.. బీఎస్పీకి తెలంగాణలో డబుల్‌ డిజిట్‌ వస్తుంది. నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు.” అని ఆయన అన్నారు. హెలికాప్టర్‌ను ఎవరూ స్పాన్సర్ చేయలేదని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. కేసీఆర్‌ కోనేరు కోనప్పను వీరప్పన్‌ అని పోల్చారన్నారు. సిర్పూర్‌లో అన్ని ఆంధ్ర కాంట్రాకర్లకు అప్పజెప్పారని ఆరోపించారు. పరిటాల రవి హత్యకు సంబంధించి ముందుగా ఎలాంటి ఇంటెలిజెన్స్ సమాచారం రాలేదన్నారు. జైల్లో మద్దెలచెరువు సూరికి కమ్యూనికేషన్ డివైజ్‌ వెళ్తున్నాయని సమాచారం తెలిసిందని.. ఈ విషయం గురించి డీజీపీకి లెటర్‌ రాశానన్నారు. పరిటాల రవికి కొంత మంది వ్యక్తులతో వైరం ఉందన్న ఆయన.. ప్రాణాలకు ప్రమాదం ఉందని పరిటాల రవి వచ్చి నాతో మాట్లాడారన్నారు. నేను మాపై అధికారులకు చెప్పానన్నారు.

Also Read: BRS Vs Congress: కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ.. గులాబీ నేతపై కేసు నమోదు

ఎన్డీఏ, ఇండియా కూటమిలతో ఉండమని మాయావతి చెప్పారన్నారు. మందకృష్ణను, ఆర్‌ కృష్ణయ్యను ఆహ్వానించాను.. కానీ ఒకరు జగన్‌ దగ్గరకు వెళ్లి ఎంపీ పదవిని పొందారు. మరొకరు మోడీ దగ్గరకు వెళ్లి, రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారన్నారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ..” ప్రధాని మోడీ మాటలు నీటమూటలు.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి నరేంద్ర మోడీ. 2014 నుంచి 2023వరకు అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పటివరకు ఎస్సీ వర్గీకరణను ఎందుకు అమలు చేయలేదు. ఎలాంటి పోరాటాలు చేయకుండానే 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను అమలు చేశారు. బీఎస్పీ ఎప్పుడూ బీజేపీకి సపోర్టు చేయలేదు. అప్పుట్లో ఈస్ట్‌ ఇండియా కంపెనీ, ఇప్పుడు వెస్ట్‌ ఇండియా కంపెనీలు దోచుకుంటున్నాయి. వర్గీకరణ మంచిదే, కానీ దానివల్ల వచ్చే ఫలితాలు పరిమితం. నేను ఎవరి బినామీని కాదు.. నాకు ఎక్కడా ఆస్తులు లేవు, సిర్పూర్‌లో ఒక ఇల్లు మాత్రం కొనుకున్నాను.. ఎంఐఎం ఒక్కటే ముస్లింల పార్టీ కాదు. ప్రత్యేక రిగ్గింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఎంఐఎం పార్టీ గెలుస్తోంది.” అని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

 

Exit mobile version