Iran War: ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధ ప్రభావం భారత్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. భారతదేశానికి సహజవాయువు సరఫరాదారుగా ఉన్న ఖతార్, ఇరాన్ దాడులతో సతమతం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు ఖతార్ LNG ఎగుమతులను 40 శాతం వరకు తగ్గించింది. ఖతార్ ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు ఉత్పత్తిదారుగా ఉంది.
Read Also: T20 World Cup Semi-final: చంద్ర గ్రహణం ఎఫెక్ట్.. టీమ్ ఇండియా ప్రాక్టీస్ వాయిదా..
ఖతార్ లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. తనపై జరిగిన దాడికి ఆ దేశం ప్రతీకారం తీర్చుకుంటోంది. అంతేకాకుండా, ఖతార్ లోని ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ ఎన్ జి ప్లాంట్లలో ఒకటైన ఇరాన్ డ్రోన్లు మరియు క్షిపణులతో దాడి చేసింది. సోమవారం, ఇరాన్ రెండు ఖతార్ ఎనర్జీ ప్లాంట్లు, రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ, మెసాయిద్ ఇండస్ట్రియల్ సిటీపై దాడి చేసింది. వరస దాడులతో ఖతార్ తన ప్లాంట్లను మూసేయాలని నిర్ణయించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ సరఫరాను ప్రభావితం చేయనుంది.
ఖతార్ నుంచి ఎగుమతి అవుతున్న నాచురల్ గ్యాస్ వినియోగదారుల్లో భారత్ అతిపెద్దది. భారతదేశం ఏటా సుమారు 27 మిలియన్ టన్నుల లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ (LNG) ను దిగుమతి చేసుకుంటుంది. ఇందులో ఖతార్ 40 శాతం సరఫరా చేస్తోంది. విద్యుత్ ఉత్పత్తి మరియు ఎరువుల ఉత్పత్తి నుండి CNG పంపిణీ, పైపుల ద్వారా వంట గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్‌ల వరకు వివిధ రంగాలలో డిమాండ్‌ను తీర్చడానికి భారతదేశం ఈ వాయువును దిగుమతి చేసుకుంటుంది.
