Qatar-Iran Conflict 2026: ముదిరిన ఖతార్ – ఇరాన్ వివాదం.. ఇంధన యుద్ధం దిశగా పశ్చిమాసియా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Qatar-Iran Conflict 2026: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. బుధవారం ఖతార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటూ, ఇరాన్‌కు చెందిన సైనిక, భద్రతా అటాచీలను “పర్సోనా నాన్ గ్రాటా” (అవాంఛనీయ వ్యక్తులు)గా ప్రకటించింది. వారిని కేవలం 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాలని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అల్టిమేటం జారీ చేసింది.
READ ALSO: Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి పండగపూట అన్ని విజయాలే!
Also Read
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
ఈ ఘటనకు నేపథ్యం ఇదే..
బుధవారం రాత్రి ఖతార్‌లోని కీలకమైన రాస్ లఫాన్ (Ras Laffan) పారిశ్రామిక నగరంపై ఇరాన్ భీకర దాడికి పాల్పడింది. ప్రపంచానికే ఇంధన వనరుగా ఉన్న ఈ ఎల్‌ఎన్‌జి (LNG) సిటీపై దాడి జరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు, గ్యాస్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ఇది ఒక పూర్తి స్థాయి “ఇంధన యుద్ధం”గా మారే సూచనలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
దాడిపై ఖతార్ ప్రభుత్వం ఏమన్నదంటే..
ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ అంశంపై అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ఇరాన్ తీరును తీవ్రంగా తప్పుబట్టింది.. ఇరాన్ పదేపదే ఖతార్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడటం, దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను దారుణంగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఈ చర్యలు అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2817ను బరితెగించి ఉల్లంఘించడమేనని ఖతార్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. ఇరాన్ రాయబార కార్యాలయానికి పంపిన అధికారిక లేఖలో, సదరు అటాచీలకు, వారి సిబ్బందికి ఖతార్‌లో ఇకపై చోటు లేదని తేల్చి చెప్పింది. ఇరాన్ దురాక్రమణకు గట్టి సమాధానం ఇస్తామని దోహా హెచ్చరించింది. తమ జాతీయ ప్రయోజనాలను, భద్రతను కాపాడుకోవడానికి ఎంతటి కఠినమైన చర్యలకైనా వెనుకాడబోమని పేర్కొంది. అంతర్జాతీయ చట్టాల పరిధిలో తగిన రీతిలో ప్రతిస్పందించే హక్కు తమకు ఉందని ఖతార్ నొక్కి చెప్పింది.
READ ALSO: Dhurandhar The Revenge Review: దురంధర్: ది రివెంజ్ రివ్యూ
తాజావార్తలు
-
Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
-
Payal Mehta: జర్నలిస్ట్ పాయల్ మెహత మరణానికి అసలు కారణమేంటి?
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
ట్రెండింగ్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?