NTV Telugu Site icon

Python: వామ్మో.. ఏంటిసామి ఇది.. పాఠశాల సమీపంలో భారీ కొండచిలువ..

Python

Python

Python in Delhi: ఢిల్లీలోని చంద్ర విహార్ ప్రాంతంలోని ఓ పాఠశాల సమీపంలో మంగళవారం రాత్రి కొండచిలువ కనిపించడంతో భయాందోళన వాతావరణం నెలకొంది. కొందరు అటుగా వెళ్తున్న జనం పెద్ద ఎత్తున కొండచిలువను చూసేందుకు ఆగారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం మేరకు.. చంద్ర విహార్‌ ఎస్‌డిఎం స్కూల్‌ సమీపంలోని ఖాళీ స్థలంలో మంగళవారం రాత్రి ఓ భారీ సైజు కొండచిలువ కనిపించింది. కొండచిలువను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

కొందరు వ్యక్తులు కొండచిలువను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, కొండచిలువ ఎవరికీ హాని కలిగించ లేదని సమాచారం. ఢిల్లీలో ముఖ్యంగా వర్షాకాలంలో పాము లేదా కొండచిలువ కనిపించడం అసాధారణం కాదని నిపుణులు అంటున్నారు. వన్యప్రాణుల శాస్త్రవేత్త డాక్టర్ ఫయాజ్ ఖుద్సర్ మాట్లాడుతూ.., ఈ ప్రాంతం యమునా నదికి చాలా దగ్గరగానే ఉంది. అటువంటి పరిస్థితిలో ఒక కొండచిలువ నీట మునిగిన ప్రాంతం నుండి సంచరిస్తూ అక్కడికి చేరుకుంటుందని తెలిపారు. స్థానిక అధికారులు వెంటనే సమాచారాన్ని అటవీ శాఖ సిబ్బందికి అందించారు. వారు ఘటనస్థలికి చేరుకొని చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో పాఠశాల సమీపంలో కొండచిలువ రాత్రి సమయంలో కనిపించింది. ఆ సమయంలో స్కూల్ పిల్లలు ఘటనా స్థలంలో లేరు. కొండచిలువలకు సంబంధించిన వీడియోలను పెద్ద సంఖ్యలో ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తూ ఈ ఘటనపై తమ ఆశ్చర్యాన్ని, ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదకరమైన పాము కనిపించడం రాజధానిలో వన్యప్రాణుల ఉనికిని పెరుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Show comments