ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవికి పీవీఎన్ మాధవ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అధ్యక్ష పదవికి సింగిల్ నామినేషన్ వేయాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో మాధవ్ ఎన్నిక లాంఛనమే అంటున్నాయి పార్టీ వర్గాలు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ తో ఐదు దశాబ్దాల పైగా మాధవ్ కుటుంబానికి అనుబంధం ఉంది. మాధవ్ ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పనిచేశారు. తండ్రి కొడుకులు ఇద్దరు పార్టీ అధ్యక్షులు అయిన అరుదైన రాజకీయ నేపథ్యం చోటుచేసుకోనున్నది.
Also Read:Real Estate Fall In Hyderabad : హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పతనానికి అసలు కారణాలు
ఉమ్మడి రాష్ట్రానికి బీజేపీ తొలి అధ్యక్షు డు గా పనిచేసిన మాధవ్ తండ్రి చలపతి రావు పనిచేశారు. ఏపీ బిజెపి రాష్ట్ర కార్యాలయానికి ప్రస్తుత అధ్యక్షురాలు పురంధేశ్వరి చేరుకున్నారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం అధ్యక్ష ఎన్నిక నిర్వహించనున్నారు. కర్ణాటక ఎంపీ మోహన్ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు.
