NTV Telugu Site icon

PV Sindhu: పారిస్ ఒలింపిక్స్‌లో పీవీ సింధు శుభారంభం.. తొలి మ్యాచ్‌లో విజయం

Pv Sindhu Paris Olympics

Pv Sindhu Paris Olympics

PV Sindhu: పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. ఒలింపిక్స్‌లో తన తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. గ్రూప్‌ స్టేజీలో మాల్దీవులకు చెందిన ఫాతిమాత్‌ నబానా అబ్దుల్ రజాక్‌పై 21-9, 21-6 తేడాతో గెలిచి భారత క్రీడాభిమానుల్లో పతక ఆశలను రేపింది. కేవలం 29 నిమిషాల్లోనే ఈ మ్యాచ్‌ను పీవీ సింధు ముగించడం గమనార్హం. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ రాత్రి 8 గంటలకు జరగనుంది. జర్మనీ క్రీడాకారుడైన ఫాబియన్‌తో భారత బ్యాడ్మింటన్ స్టార్‌ ప్రణయ్ తలపడనున్నాడు. ఇదిలా ఉండగా.. మరోవైపు రోయింగ్‌ మెన్స్‌ సింగిల్స్‌ పోటీల్లో బాల్‌రాజ్ పన్వార్‌ క్వార్టర్ ఫైనల్‌కు చేరడం విశేషం.

Read Also: TFC: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్

Show comments