NTV Telugu Site icon

PV Sindhu Wedding: పీవీ సింధు పెళ్లి సందడి షురూ!

Pv Sindhu Marriage

Pv Sindhu Marriage

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పూసర్ల వెంకట సింధు పెళ్లి సందడి మొదలైంది. పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్త సాయితో సింధు వివాహాం ఆదివారం రాత్రి 11.30 గంటలకు జరగనుంది. రాజస్థాన్ ఉదయ్‌పుర్‌లోని రఫల్స్‌ హోటల్లో సంప్రదాయ రీతిలో పెళ్లి జరగబోతోంది. పెళ్లికి 140 మంది అతిథులు హాజరు కాబోతున్నారు. అతిథుల కోసం హోటల్లో 100 గదులు బుక్‌ చేసినట్లు సమాచారం. సింధు తన వివాహానికి ప్రధాని సహా దేశవ్యాప్తంగా పలు వురు ప్రముఖులను ఆహ్వానించారు.

పీవీ సింధు పెళ్లి వేడుకల్లో భాగంగా శుక్రవారం హల్దీ సంబరాలు నిర్వహించగా.. శనివారం మెహందీ, సంగీత్‌ కార్యక్రమాలను నిర్వహించారు. ఆదివారం సాయంత్రం వరమాల కార్యక్రమం జరుగుతుంది. రాజస్థాన్‌ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రఫల్స్‌ హోటల్లో పెళ్లి వేదికను అలంకరించారు. దక్షిణ భారత సంప్రదాయం ప్రకారం జరిగే ఈ వివాహానికి వచ్చే అతిథులకు రాజస్థాన్‌ ప్రత్యేక వంటకాలను రుచి చూపనున్నారు. మంగళవారం (డిసెంబర్ 24) నాడు హైదరాబాద్‌లో భారీగా రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరు కానున్నారు.

Show comments