Site icon NTV Telugu

PV Sindhu : సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి తన వివాహానికి ఆహ్వానించిన పీవీ సింధు

Pv Sindhu

Pv Sindhu

PV Sindhu : భారత షెట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఈ రోజు సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం నివాసానికి వెళ్లి ఈ నెల 22న రాజస్థాన్‌లో జరగనున్న తన వివాహానికి హాజరుకావాలంటూ ముఖ్యమంత్రికి శుభలేఖ అందించి ఆహ్వానించారు. ఈ రోజు మధ్యాహ్నం పీవీ సింధు కుటుంబ సభ్యుల మధ్య ఎంగేజ్‌మెంట్ వేడుక నిర్వహించబడింది. ఈ సందర్భంగా సింధు, వెంకట దత్తసాయి పరస్పరం ఉంగరాలు మార్చుకున్నారు. సింధు తన ఎంగేజ్‌మెంట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఫొటోకు “ఒకరి ప్రేమ దక్కిన సమయంలో, తిరిగి మనం ప్రేమించాలి” అనే క్యాప్షన్ జత చేశారు. ఎంగేజ్‌మెంట్ వేడుకలో వారు కేక్ కట్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. పీవీ సింధు వివాహం ఈ నెల 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Exit mobile version