Site icon NTV Telugu

Putin Warning US: అమెరికాకు పుతిన్ వార్నింగ్.. సంబంధాలను నాశనం చేస్తుందని హెచ్చరిక!

Putin Warning Us

Putin Warning Us

Putin Warning US: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రోజురోజుకు తీవ్రతరం అవుతుంది కానీ, ముగింపు దిశగా అడుగులు మాత్రం పడటం లేదు. తాజా ఈ యుద్ధంలోకి అమెరికా సూపర్ వెపన్ ఎంట్రీ ఇస్తుందనే వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ వెపన్‌పై, అమెరికా తీరుపై రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ ఆయన అగ్రరాజ్యానికి ఏమని వార్నింగ్ ఇచ్చారో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Botsa Satyanarayana: కూటమి ప్రభుత్వానికి జగన్ ఫోబియా పట్టుకుంది.. బొత్స సంచలన వ్యాఖ్యలు..

అమెరికా-రష్యా సంబంధాలను పూర్తిగా నాశనం చేస్తుంది..
రష్యా లోపల సుదూర దాడులు చేయడానికి ఉక్రెయిన్‌కు అమెరికా టోమాహాక్ క్షిపణులను అందిస్తే, ఇది మాస్కో- వాషింగ్టన్‌ల మధ్య సంబంధాలను పూర్తిగా నాశనం చేస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య శిఖరాగ్ర సమావేశం జరిగి రెండు నెలల కన్నా తక్కువ సమయం మాత్రమే గడిచింది. ఈ నేపథ్యంలో తాజాగా పరిణామాల మధ్య మాస్కో-కీవ్‌ల మధ్య శాంతి అనేది మరింత దూరంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్లో రష్యన్ దళాలు ముందుకు సాగుతూనే ఉన్నాయి, రష్యన్ డ్రోన్లు నాటో భూభాగంలోకి ప్రవేశించినట్లు పలు నివేదికలు తెలిపాయి. రష్యా లోపల దాడులు చేసే అవకాశాన్ని ఇప్పుడు అమెరికా బహిరంగంగా పరిశీలిస్తోందని సమాచారం. శాంతి కోసం మధ్యవర్తిత్వం చేయడంలో పుతిన్ అసమర్థతపై ఇటీవల ట్రంప్ నిరాశ వ్యక్తం చేశారు. ట్రంప్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ను లొంగదీసుకోవడంలో విఫలమైన “కాగితపు పులి” అని రష్యాను అభివర్ణించారు.

ఉక్రెయిన్‌కు అమెరికా టోమాహాక్ క్షిపణులు..
రష్యాలోకి లోతుగా, మాస్కో వరకు కూడా దాడి చేయడానికి అనువైన లాంగ్ రేంజ్ టోమాహాక్ క్షిపణుల కోసం ఉక్రెయిన్ చేసిన అభ్యర్థనను వాషింగ్టన్ పరిశీలిస్తోందని అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ గత నెలలో అన్నారు. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారా లేదా అనేది అస్పష్టంగా ఉంది. “ఇది మన సంబంధాన్ని నాశనం చేస్తుంది, ఇది జరిగితే, మన సంబంధాలు పూర్తిగా నాశనమవుతాయి లేదా కనీసం వాటిలో ఇటీవల కనిపించిన సానుకూల సంకేతాలు పూర్తిగా పోతాయి” అని పుతిన్ ఆదివారం రష్యా టీవీ ఛానెల్లో జర్నలిస్ట్ పావెల్ జరుబిను ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఒక రకంగా ఆయన రష్యా వేదికగా అమెరికాకు వార్నింగ్ ఇచ్చారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అగ్రరాజ్యం తన సూపర్ వెపన్‌ను ఉక్రెయిన్‌కు ఇవ్వకుండా చూడటానికి పుతిన్ ఈ రకంగా హెచ్చరికలు చేస్తున్నట్లు తెలిపారు. రష్యా అధ్యక్షుడి వార్నింగ్‌ను అగ్రరాజ్యం పట్టించుకుంటుందా లేదా అనేది వేచి చూడాలని చెబుతున్నారు.

READ ALSO: Nepal Floods 2025: నేపాల్‌లో వరదల విధ్వంసం.. 42 మంది మృతి

Exit mobile version