Site icon NTV Telugu

JFK Assassination Documents: ట్రంప్ రాజకీయ వ్యూహానికి పుతిన్ ఫైల్ బాంబు దెబ్బ..

Jfk Assassination Documents

Jfk Assassination Documents

JFK Assassination Documents: అమెరికా రాజకీయాలు మరోసారి కుదుపులకు లోనవుతున్నాయి. ఎందుకో తెలుసా.. యూఎస్ మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ హత్యకు సంబంధించిన రహస్య పత్రాలను తాజాగా రష్యా అమెరికా అధికారులకు అందజేసింది. ఈ ఫైళ్లకు అమెరికన్ రాజకీయ చరిత్రను కదిలించే సామర్థ్యం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్‌కు టోమాహాక్ క్షిపణులను అందించడం గురించి మాట్లాడిన తర్వాత.. రష్యా గురించి కీలక ప్రకటనలు చేసిన సమయంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. దీనిని ట్రంప్ రాజకీయ వ్యూహానికి పుతిన్ ఫైల్ బాంబు దెబ్బగా విశ్లేషకులు అభివర్ణించారు.

READ ALSO: Indore Lokayukta: రిటైర్డ్ ఎక్సైజ్ అధికారి ఇంట్లో గుట్టలుగా కరెన్సీ నోట్లు, బంగారు ఆభరణాలు..

నేటికీ ప్రపంచానికి తెలియని రహస్యం..
ఈ రహస్య పత్రాలు రష్యన్ నిఘా సంస్థ KGB కి చెందినవిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. యూఎస్ మాజీ అధ్యక్షుడు కెన్నెడీ హత్యకు సంబంధించిన కొత్త సమాచారం ఈ పత్రాల్లో ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పలు నివేదికల ప్రకారం.. ఈ ఫైళ్లు హత్య వెనుక అంతర్జాతీయ కుట్ర, కొంతమంది అమెరికన్ రాజకీయ ప్రముఖుల పాత్రలు ఉన్నాయని సూచిస్తున్నాయి. కెన్నెడీ హత్య అమెరికన్ రాజకీయాల్లో అత్యంత సున్నితమైన, మర్మమైన సమస్యలలో ఒకటిగా మిగిలిపోయింది. 1963లో టెక్సాస్‌లోని డల్లాస్‌లో ఆయన కాల్చి చంపారు. కానీ ఆయన హత్యకు అసలు వాస్తవం ఏంటనేది నేటికీ ప్రపంచానికి తెలియదు.

అమెరికా కాంగ్రెస్ మహిళా ఎంపీ అనా పౌలినా లూనా (రిపబ్లిక్ పార్టీ) ఇటీవల సోషల్ మీడియాలో ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. ఆమె తన పోస్ట్‌లో ఇలా రాసింది.. “జెఎఫ్‌కె హత్యపై రష్యన్ రాయబారి తయారు చేసిన నివేదిక హార్డ్ కాపీ నాకు అందింది. నిపుణుల బృందం ఈ ఉదయం నా కార్యాలయానికి చేరుకుని పత్రాలను అనువదించి పూర్తిగా సమీక్షిస్తుంది. మేము వాటిని త్వరలో అప్‌లోడ్ చేస్తాము. ఇది చారిత్రాత్మకంగా చాలా ముఖ్యమైనది.” అని లూనా తన పోస్ట్‌లో రష్యన్ రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ నివేదిక చాలా కాలంగా ఉన్న అనేక రహస్యాలను వెలికితీస్తుందని పేర్కొన్నారు.

కెన్నెడీ ఫైళ్లను పూర్తిగా బహిర్గతం చేస్తానని డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. కానీ ఆ తరువాత ఆయన వాటిని బహిర్గతం చేయాలనే డిమాండ్లను విస్మరించారు. ఇప్పుడు రష్యా నుంచి వచ్చిన రహస్య పత్రాల్లో కొత్త సమాచారం ఉన్న నేపథ్యంలో, యునైటెడ్ స్టేట్స్‌లో రాజకీయ తిరుగుబాటు జరగనుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఫైళ్లలో అమెరికన్ ప్రముఖుల పేర్లు బయటపడితే.. ఇది అగ్రరాజ్య రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చుతుందని చెబుతున్నారు.

READ ALSO: Ravi Shastri: రోహిత్-విరాట్‌లు అప్పుడే రిటైర్ అవుతారు..

Exit mobile version