Man Missing: ఉక్రెయిన్‌పై భీకరంగా దాడులు చేస్తోన్న రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆ దేశ పౌరులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. రష్యాకు చెందిన చట్టసభ సభ్యుడు, వ్యాపారవేత్త పావెల్ ఆంటోవ్, అతని సన్నిహితుడు వ్లాదిమిర్ బిడెనోవ్‌లు ఇద్దరూ కూడా రెండ్రోజుల వ్యవధిలో రాయగడ జిల్లాలోని ఒక హోటల్‌లో రక్తపు మడుగులో పడి కనిపించటం కలకలం రేపింది. తాజాగా పుతిన్‌ను వ్యతిరేకించిన మరో రష్యా పౌరుడు కనిపించకుండా పోయాడనే వార్త కలకలం సృష్టిస్తోంది. రాష్ట్ర పోలీసులు రష్యాకు చెందిన ఆ వ్యక్తి కోసం శోధిస్తున్నారు. కనిపించకుండా పోయిన ఆ వ్యక్తి ఉక్రెయిన్ యుద్ధ వ్యతిరేక కార్యకర్త, స్వయం ప్రకటిత ఉక్రెయిన్ యుద్ధ కార్యకర్త.
ఈ తప్పిపోయిన వ్యక్తి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను విమర్శించేవాడు. గతంలో ఒడిశా రాజధానిలో యుద్ధ వ్యతిరేక, పుతిన్ వ్యతిరేక నినాదాలతో కూడిన ప్లకార్డులు పట్టుకుని కనిపించాడు. ఒక నెల క్రితం ఆ వ్యక్తి భువనేశ్వర్ రైల్వే స్టేషన్‌లో “నేను రష్యన్ రెఫ్యూజీని, నేను యుద్ధానికి వ్యతిరేకిని, నేను పుతిన్‌కు వ్యతిరేకిని, నేను నిరాశ్రయుడిని, దయచేసి నాకు సహాయం చేయండి” అనే ప్లకార్డును పట్టుకుని కనిపించాడు. మరోవైపు.. రైల్వే స్టేషన్‌లో ప్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేసిన వ్యక్తి ఆచూకీ గల్లంతైనట్లు వార్తలు చక్కర్లు కొంటాయి. ఆయనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నాయి. ఒడిశా రాయగడలోని హోటల్‌లో ఇద్దరు రష్యన్ వ్యక్తులు మరణించిన క్రమంలో ఈ వార్తలు చక్కర్లు కొట్టడంతో ఆందోళనలు నెలకొన్నాయి. అయితే, ఆ వార్తలను ఒడిశా పోలీసులు కొట్టిపారేశారు. ఆయన క్షేమంగానే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Russia New Year Gift : రష్యా న్యూ ఇయర్ గిఫ్ట్.. వారికి ఆదాయపన్ను లేనట్లే
అయితే ఇప్పటివరకు ఎలాంచి మిస్సింగ్ కేసు నమోదు కాలేదని రైల్వే పోలీసులు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. . రాయగడ హోటల్ ఘటనలకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. డిసెంబరు 24న హోటల్ మూడో అంతస్తు నుంచి పడి పావెల్ ఆంటోవ్ మరణించగా, డిసెంబరు 22న బిడెనోవ్ తన గదిలో శవమై కనిపించాడు. భువనేశ్వర్ రైల్వే స్టేషన్‌లోని రైల్వే అధికారులు నెల రోజుల క్రితం ఆ పోస్టర్ పట్టుకున్న వ్యక్తితో మాట్లాడారు.
