NTV Telugu Site icon

Alluarjun : పుష్ప 3 కూడా ఉండొచ్చు.. కన్ఫామ్ చేసిన ఐకాన్ స్టార్..

Whatsapp Image 2024 02 17 At 10.12.13 Am

Whatsapp Image 2024 02 17 At 10.12.13 Am

పుష్ప మూవీ ఫ్యాన్స్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ శుభవార్త చెప్పారు.. పుష్ప సినిమాకు మూడో పార్ట్ కూడా ఉంటుందని బెర్లిన్ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అల్లు అర్జున్‌ ప్రకటించారు.బెర్లిన్ ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అల్లు అర్జున్ పుష్ప సినిమాను స్క్రీనింగ్ చేశారు. పుష్ఫ తరఫునే కాకుండా ఈ ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఇండియన్ ప్రతినిధిగా అల్లుఅర్జున్ హాజరు అయ్యారు.. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆయన మాట్లాడుతూ పుష్ప సినిమాకు మూడో భాగం కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపారు.. ఓ ఫ్రాంచైజ్‌లా పుష్ప సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.పుష్ప సినిమా థియేటర్ల కంటే ఓటీటీలో ఎక్కువగా అభిమానులకు రీచ్ అయ్యిందని ఆయన తెలిపారు.ఓటీటీ వల్లే ఈ సినిమాకు ఇంటర్‌నేషనల్ వైడ్‌గా క్రేజ్ ఏర్పడి 2021లో బిగ్గెస్ట్ ఫిల్మ్‌గా పుష్ప నిలిచిందని అల్లు అర్జున్ తెలిపారు.అలాగే పుష్ప పార్ట్ 2పై బన్నీ బెర్లిన్ ఇంటర్‌నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆసక్తికర కామెంట్స్ చేశారు..

పుష్ప పార్ట్ 2లో పుష్పరాజ్‌లోని ఓ డిఫరెంట్ షేడ్‌ను చూస్తారని పుష్పకు మించి తన క్యారెక్టరైజేషన్  హై లెవెల్‌లో ఉంటుందని, పుష్పరాజ్‌కు ఎదురయ్యే సవాళ్లను ఆడియెన్స్ ఊహలకు మించి భారీ స్కేల్‌లో సుకుమార్ ఈ సినిమాలో చూపించబోతున్నాడని అల్లుఅర్జున్ తెలిపారు..పుష్ప సినిమాను రీజనల్ లెవెల్‌లో తెరకెక్కించామని, పుష్ప 2ను మాత్రం ఇంటర్‌సేషనల్ స్టాండర్డ్స్‌తో రూపొందిస్తున్నామని తెలిపారు.పుష్ప 2 మూవీ ఆగస్ట్ 15న పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజ్ కాబోతోంది. ఎర్రచందనం సిండికేట్ నాయకుడిగా మారిన తర్వాత పుష్పరాజ్ జీవితంలో జరిగిన పరిణామాలు అలాగే భన్వర్‌సింగ్ షెకావత్‌తో పుష్పరాజ్‌కు ఏర్పడిన వైరం నేపథ్యంలో పుష్ప సీక్వెల్ సాగనున్నట్లు సమాచారం. పుష్ప లో ఫహాద్ ఫాజిల్ రోల్ తక్కువ నిడివితో కనిపించింది. సెకండ్ పార్ట్‌లో మాత్రం ఫుల్ లెంగ్త్ రోల్‌లో అతడు కనిపించనున్నట్లు తెలుస్తుంది.. అలాగే పుష్ప 2లో కూడా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.

Show comments