Pushpa 2 :క్లైమాక్స్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్న సుకుమార్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందిన పుష్ప మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారారు. అంతే కాదు రీసెంట్ గా ప్రకటించిన 69 వ జాతీయ చలన చిత్ర అవార్డు లలో ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ అవార్డు అందుకున్నాడు. అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ కు కూడా అవార్డు లభించింది.పుష్ప సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేయడంతో పుష్ప 2 సినిమా పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.. అందుకే పుష్ప 2 మూవీ కచ్చితంగా గ్లోబల్ వైడ్ గా భారీ విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంగా వుంది.ఈ సినిమా కోసం దాదాపుగా ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగింది. కథ విషయం లో ఎంతో క్లారిటీగా ఉండే సుకుమార్ పుష్ప 2 విషయం లో చాలా మార్పులు చేర్పులు చేయడం తో పాటు చాలా వర్షన్ లలో క్లైమాక్స్ ను కూడా రాసుకున్నారని సమాచారం.
ప్రస్తుతం సుకుమార్ క్లైమాక్స్ విషయం లో కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది.అంతే కాకుండా ఈ సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ఫ్యాన్స్ కూడా ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం.. కానీ ఆ టైం లో చిత్రం విడుదల సాధ్యం కాదు అంటూ చాలా మంది చెప్పుకొస్తున్నారు.. సుకుమార్ చిత్రం విడుదల విషయం లో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అంతే కాకుండా సమ్మర్ వరకు వెయిట్ చేస్తే అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి.దీనితో సినిమా షూటింగ్ ను డిసెంబర్ నెల కల్లా పూర్తి చేసే పనిలో వుంది చిత్ర యూనిట్.. షూటింగ్ కోసం అల్లు అర్జున్ పూర్తి డేట్లు కేటాయించారు.. అందుకే సుకుమార్ కాస్త త్వరగా ఈ సినిమాను ముగించాలని భావిస్తున్నట్లు సమాచారం.. పుష్ప సినిమాకు జాతీయ అవార్డు రావడంతో పుష్ప 2 సినిమాకు బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతున్నట్లు తెలుస్తుంది.
Also Read
- Pakistan: పాకిస్తాన్లో టెన్షన్ టెన్షన్.. ఇస్లామాబాద్ చుట్టూ కంటైనర్ గోడలు, ఆస్పత్రుల్లో హైఅలర్ట్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై ఫోకస్.. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు సీఎం దిశానిర్దేశం
- Electric Scooter: ఒక్కసారి చార్జ్ చేస్తే 400 కి.మీ వెళ్లొచ్చు.. ఆఫీస్కు వెళ్లేవారికి బెస్ట్ ఇ-స్కూటర్ ఇదే..
- Saikrishna Lockup Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం..
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్లో టెన్షన్ టెన్షన్.. ఇస్లామాబాద్ చుట్టూ కంటైనర్ గోడలు, ఆస్పత్రుల్లో హైఅలర్ట్..
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై ఫోకస్.. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు సీఎం దిశానిర్దేశం
-
Zodiac Signs : దసరా వేళ ఈ 5 రాశులకు జాక్పాట్.!
-
Cine Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలతకు ఘోర పరాభవం, ప్యానెల్ రద్దు!
-
Pine Labs: నెల రోజుల్లో 25% ప్రాఫిట్.. మరో 30% పెరిగే ఛాన్స్ ఉందట!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్‌షిప్ లాంచ్.!