NTV Telugu Site icon

Pushpa 2 : పుష్ప 2 షూటింగ్ అప్డేట్ వైరల్..

Pushpa 2

Pushpa 2

Pushpa 2 :ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 ..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్సె ,టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి,ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Read Also :Thug Life : కమల్ ‘థగ్ లైఫ్’ షూట్ లో ప్రమాదం..ఆ స్టార్ యాక్టర్ కు గాయాలు.

ఇటీవలే ఈ సినిమా నుండి మేకర్స్ రెండు పాటలు రిలీజ్ చేయగా ఈ రెండు పాటలు కూడా చార్ట్ బస్టర్ గా నిలిచాయి.ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందనే న్యూస్ తెగ వైరల్ అవుతుంది.ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కారణంగానే ఈ సినిమా రిలీజ్ ను మరో నెల రోజులు వాయిదా వేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ జూన్ 13 నుంచి రామోజీ ఫిలిం సిటీలో జరగనుంది.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

Show comments