Pushpa 2 : సరికొత్త స్ట్రాటజీ తో రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2. ఈ సినిమాను ఎవరూ ఊహించనంత గ్రాండ్ గా పక్కా స్క్రిప్ట్ తో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్. అయితే తాజాగా పుష్ప2 రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.పుష్ప సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ సినిమా రిలీజ్ కోసం అటు నార్త్ ఆడియన్స్, ఇటు సౌత్ ఆడియన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.దీనితో రిలీజ్ డేట్ ని పక్కాగా ప్లాన్ చేసి ప్రకటించారు. ఈ సినిమాను 2024 స్వతంత్ర దినోత్సవ సందర్బంగా ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ డేట్ చూసి అంతా షాక్ అ్యయారు. ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అయ్యిన ఈ సినిమా ఇంత లేటుగా రిలీజ్ అవుతుంది ఏంటనీ అందరూ చర్చించుకుంటున్నారు. అసలు ఆ డేట్ న విడుదల చేయడానికి ప్రత్యేక కారణం ఏమైనా వుందా అని తెగ చర్చించుకుంటున్నారు.అయితే పుష్ప2 ని ఆగస్ట్ 15న కన్ఫర్మ్ చేయడానికి పెద్ద కారణముందనీ తెలుస్తుంది..
ఆగస్టు 15 గురువారం సెలవు. దీని తర్వాత శుక్ర-శని-ఆదివారం వీకెండ్ కూడా సినిమాకు కలిసొచ్చేస్తుంది. ఆ తర్వాత సోమవారం 19 వ తేదీ రక్షా బంధన్.. ఇలా ఐదు రోజుల భారీ వీకెండ్ ఉంది. ఆ తర్వాత 23 నుంచి 25 దాకా వీకెండ్ , 26 ఆగస్ట్ జన్మాష్టమి..ఇన్ని వరసగా కలిసి రావడంతో సినిమాను ఈ టైం విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.వస్తున్నాయి… ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే కనుక కచ్చితంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.మరి చూడాలి పుష్పగాడి లెక్క ఏ మాత్రం ఉంటుందో.అయితే పుష్ప స్క్రిప్ట్ వర్క్ కోసమే దాదాపు సంవత్సర కాల సమయం తీసుకొన్నారు మేకర్స్. ఆతరువాత ప్రీ ప్రొడక్షన్ కోసం మరో ఆరునెలల సమయం పట్టింది. దీంతో ఎంతో లేటుగా సెట్స్ పైకి వెళ్ళింది పుష్ప 2 మూవీ .ఇక పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు ఏర్పడటంతో దర్శకుడు సుకుమార్ కథలో చాల మార్పులు చేసినట్లు తెలుస్తుంది.ఇందుకోసం కొత్త సెట్స్ కూడా వేయాల్సి రావడంతో పుష్ప షూటింగ్ కాస్త ఆలస్యం అవుతూ వచ్చింది. పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడుగా అల్లుఅర్జున్ కి నేషనల్ అవార్డు రావడంతో పుష్ప 2 సినిమాపై ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెరిగింది. మరి మరో సారి బాక్స్ ఆఫీస్ నీ పుష్ప గాడు రూల్ చేస్తాడో లేదో చూడాలి.
Also Read
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
- Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
తాజావార్తలు
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!