NTV Telugu Site icon

Pushpa 2 : ఆ ప్రముఖ బ్యానర్ కు దక్కిన పుష్ప 2 కేరళ రైట్స్..?

Whatsapp Image 2024 05 08 At 2.23.47 Pm

Whatsapp Image 2024 05 08 At 2.23.47 Pm

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్  పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “.. బ్లాక్ బస్టర్ పుష్ప మూవీకి ఈ సినిమా కొనసాగింపుగా వస్తుంది .పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించి భారీ కలెక్షన్స్ కూడా సాధించింది.దీనితో పుష్ప 2 సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగాయి .ఇప్పటికే “పుష్ప 2 ” నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్‌ ను రిలీజ్ చేసారు.పుష్ప పుష్ప అంటూ సాగే సాంగ్ ను మేకర్స్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీతో పాటు బెంగాళీ భాషల్లో కూడా విడుదల చేయగా నెట్టింట మిలియన్ల సంఖ్యలో వూస్ రాబడుతోంది.ఈ సాంగ్ లో పుష్పరాజ్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

అలాగే పుష్ప 2 నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని కేరళలో “E4 ఎంటర్టైన్మెంట్” రిలీజ్ చేయనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ తాజాగా ట్వీట్ చేసారు.కేరళలో అల్లు అర్జున్‌కు వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .మలయాళంలో అల్లు అర్జున్ ను మల్లు అర్జున్ గా పిలుచుకుంటారు ఇప్పటికే పుష్ప సినిమాకు మలయాళీలు ఎంతగానో ఆదరించారు.పుష్ప 2 రిలీజ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.” పుష్ప 2 ” మూవీ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.ఈ సినిమాతో అల్లుఅర్జున్ మరోసారి రికార్డ్స్ క్రియేట్ చేసేందుకు సిద్ధంగా వున్నాడు.మరి పుష్ప 2 సినిమాతో అల్లుఅర్జున్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.