NTV Telugu Site icon

Pushpa 2 : బుక్ మై షోలో ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన పుష్ప రాజ్

New Project (1)

New Project (1)

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా మూవీ పుష్ఫ-2 చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఆ సినిమా పై దేశ వ్యాప్తంగా ఊహకందని అంచనాలు ఉన్నాయి. కేవలం సౌత్ లోనే కాదు బీహార్ సహా నార్త్ ఇండియా మొత్తం అల్లు అర్జున్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. హిందీ వెర్షన్‌ అడ్వాన్స్‌ బుకింగ్‌లో 24 గంటల్లోనే లక్ష టికెట్స్‌ అమ్ముడు పోవటం దీనికి నిదర్శనం. ఈ మధ్యకాలంలో ఏ పాన్‌ ఇండియా సినిమాకు రానంత హైప్‌ పుష్ప 2కి వచ్చింది. ఇప్పటికే 670 కోట్లకు పైగా థియేట్రికల్‌ బిజినెస్‌ అయింది. ఇక ఆడియో రైట్స్, డిజిటల్ రైట్స్, ఓటీటీ రూపంలో మరో 400 కోట్లు వచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇప్పటికే దాదాపు 1060 కోట్ల బిజినెస్ తో ఇండస్ట్రీని షేక్‌ చేస్తోంది. నెల రోజుల ముందే ఓవర్సీస్ లో టికెట్ బుకింగ్ఫ్ మొదలయ్యాయి. గంటల్లో అన్నీ హాట్ కేకులా అమ్ముడుపోయాయి. బాక్సాఫీస్‌ వద్ద అత్యంత వేగంగా ఒక మిలియన్‌ టికెట్స్‌ అమ్ముడైన చిత్రంగా ఇది నిలిచింది. కేవలం బుక్‌ మై షోలోనే ఇన్ని టికెట్లు అమ్ముడు పోవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో ఈ చిత్రం సుమారు 12 వేల 500పైగా థియేటర్లలో విడుదల అయింది. తొలి రోజే ఏకంగా 55 వేల షోస్ వేస్తున్నారు. ఈ ఘనత పుష్ప 2కు మాత్రమే దక్కింది. 80 దేశాల్లో ఆరు భాషల్లో రిలీజ్ అయింది.

Read Also:Astrology: డిసెంబర్ 06, శుక్రవారం దినఫలాలు

పుష్ప 2 సినిమా ప్రీ-సేల్స్‌తోనే ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేయడం విశేషం. ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో ‘పుష్ప-2’ ఏకంగా మూడు మిలియన్‌కి పైగా ప్రీసేల్స్ టికెట్లు అమ్ముడయ్యాయి. ఇది ఇండియన్ సినిమాలో ఆల్ టైమ్ రికార్డు అంటూ బుక్ మై షో వెల్లడించింది. ‘పుష్ప-2’ దెబ్బకు రికార్డులు రప్పా రప్ప అంటూ బద్దలవుతున్నాయని సదరు సంస్థ పేర్కొనడం విశేషం. పుష్ప 1తో పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ఆ చిత్రానికి గానూ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా గెలుచుకున్నారు. ఆ తరంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, చిరంజీవి, ఈ తరంలో ఏ తెలుగు హీరో ఆ అవార్డు దక్కించుకోలేకపోయారు. ఇక పుష్ప-2 కు ఎందుకు ఇంత క్రేజ్ ఏర్పడిందనేది విశ్లేషకులకు సైతం అంతుబట్టడం లేదు. ఫస్ట్ డే కలెక్షన్ ప్రపంచ వ్యాప్తంగా 250- 270 కోట్లు ఉంటుందని బాక్సాఫీస్ నిపుణుల అంచనా. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Read Also:Earthquake : అమెరికాలోని కాలిఫోర్నియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Show comments