భార్యాభర్తల కథకు కాస్త కామెడీ జోడించి, రియాలిటీకి దగ్గరగా చూపిస్తే ఆ సినిమాలు ఈమధ్య బాగా వర్కౌట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అదే లైన్ తీసుకొని వినూత్నంగా ఎంటర్టైన్ చేయడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘పురుష:’ మూవీ. ప్రస్తుత తరానికి తగ్గట్టుగా ట్రెండీ మేకింగ్‌తో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చేస్తూనే డిఫరెంట్ స్టైల్ ప్రమోషన్స్ చేపడుతూ ఆడియన్స్ దృష్టిని తమవైపు తిప్పుకుంటున్నారు మేకర్స్. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు ‘పురుష:’ మూవీ టీమ్ వదులుతున్న పోస్టర్స్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. పెళ్లి తర్వాత పురుషులు పడే అవస్థలు చూపిస్తూనే.. పెళ్లి తర్వాత జీవితంలో భార్యల ఇంపార్టెన్స్ ఏంటనేది ఈ సినిమాలో చూపించనున్నారని ఇప్పటికే విడుదల చేసిన టీజర్ స్పష్టం చేసింది. ఇక తాజాగా మరో డిఫరెంట్ పోస్టర్ వదిలి సినిమాపై ఇంకాస్త హైప్ పెంచేశారు.
తాజాగా వదిలిన ఈ పోస్టర్ లో వెన్నెల కిషోర్ ఏదో అయోమయంలో పడినట్లు కనిపిస్తుండగా.. కిటికీ దగ్గర ఏం జరిగింది అని పోస్టర్ పై రాసి ఇంకాస్త క్యూరియాసిటీ పెంచారు. మొత్తానికి ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో ఖచ్చితంగా ఫుల్ ఫన్ ఉంటుందని, గతంలో ఏ సినిమాలో కూడా చూడని డిఫరెంట్ సీన్స్ ఆడియన్స్ ఈ సినిమాలో చూడబోతున్నారని స్పష్టమవుతోంది. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు ఈ ‘పురుష:’ సినిమాను నిర్మిస్తున్నారు. వీరు వులవల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతున్నాడు. కేవలం పోస్టర్లు, ఫస్ట్ లుక్స్‌తోనే జనాల్లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తున్న మేకర్స్.. ఇప్పటి వరకు హీరోల పాత్రలు, వారి బిహేవియర్, పాత్రల తీరుకి తగ్గట్టుగా పరిచయం చేశారు. పోస్టర్లు అందరినీ నవ్వించడమే గాక కంటెంట్ పై క్యూరియాసిటీ పెంచేశాయి.