తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ కూడా ఒకరు. పూరీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో కెరీర్ మొదటి లో మెజారిటీ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా అయితే నిలిచాయి.దేశముదురు, పోకిరి మరియు టెంపర్ లాంటి సినిమాలు పూరీ జగన్నాథ్ దర్శకత్వ ప్రతిభ ఏంటో చెబుతాయి.అయితే ఈ మధ్య కాలంలో పూరీ తీసిన సినిమాల లో కథ, కథనం ఏ మాత్రం కూడా అంతగా ఆసక్తికరంగా లేవు.లైగర్ సినిమా పూరీ జగన్నాథ్ ఇమేజ్ ను బాగా డ్యామేజ్ చేసిందనే విషయం తెలిసిందే. ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను తీవ్ర స్థాయిలో నిరాశపరిచాయి. అయితే ఆ సినిమా ఫ్లాపైనా ఇస్టార్ట్ శంకర్ సినిమాతో తనకు సక్సెస్ ఇచ్చిన పూరీకి హీరో రామ్ మరో అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని పూరీ జగన్నాథ్ సద్వినియోగం చేసుకుంటారో లేదో మరీ చూడాలి.
పూరీ తన సొంత బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించ బోతున్నారని తెలుస్తోంది. పూరీ, ఛార్మి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తారని సమాచారం.. కథ మరియు కథనం విషయంలో పూరీ కనుక మారితే ఆయనకు అద్భుతమైన విజయాలు దక్కుతాయి. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ అనేది పూరీ జగన్నాథ్ కు అనుకోని విధంగా దక్కిన విజయమేననే విషయం తెలిసిందే. క్రిటిక్స్ ను ఈ సినిమా ఏ మాత్రం కూడా మెప్పించలేదు.పూరీ జగన్నాథ్ కు ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అయినా లాభాలను అందిస్తుందో లేదో చూడాలి.ఈ సినిమా పరిమిత బడ్జెట్ తోనే తెరకెక్కనుందని సమాచారం.పూరీ జగన్నాథ్ కు తరువాత రోజులు బాగా కలిసి రావాలని ఆయనకు మళ్ళీ పూర్వ వైభవం రావాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. పూరీ జగన్నాథ్ ఈ జనరేషన్ ఆడియన్స్ కు నచ్చే సినిమాలను తెరకెక్కిస్తే చాలా బాగుంటుందని అభిమానుల ఆశ..