Site icon NTV Telugu

Pawan Kalyan: మాస్ మహారాజాకు పవర్ ఫుల్ హిస్ట్స్ ఇచ్చిన పవర్ స్టార్! ఎలాగో చూసేయండి..

Pawan Kalyan And Ravi Teja

Pawan Kalyan And Ravi Teja

Pawan Kalyan: టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో సినిమా అంటే బాక్సాఫీస్ దగ్గర పూనకాలే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘బద్రి’, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ వంటి చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కాల్సిన మరో మూడు సినిమాలు కూడా ఉన్నాయి తెలుసా. అయితే ఆ సూపర్ హిట్ చిత్రాల్లో పవన్ కళ్యాణ్ హీరోగా చేయలేదు. ఈ విషయాలను స్వయంగా పూరి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. పవన్ వదులుకున్న రెండు చిత్రాలు.. రవితేజ దగ్గరికి వెళ్లి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్‌గా నిలిచాయని పూరి తెలిపారు. ఇంతకీ ఆ సినిమాలు ఏంటి, వాటి వెనక ఉన్న కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Story Behind the Word “Cyclone”: భారత్‌లోనే ఉద్భవించిన “సైక్లోన్” అనే పదం.. దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఇదే..

ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ ఒక ఇంటర్య్యూలో మాట్లాడుతూ.. ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి మూడు సినిమాల కథలను ముందుగా పవన్ కళ్యాణ్‌ను వినిపించినట్లు తెలిపారు. “పవన్ కల్యాణ్ గారికి ఈ కథలు చెప్పినప్పుడు ఆయన చాలా ఎంజాయ్ చేశారు. సబ్జెక్టులు బాగున్నాయి అన్నారు కానీ, ఎందుకో అప్పుడు అవి పట్టాలెక్కలేదు. ఆయన ఈ కథలను వద్దని అనలేదు, కానీ చేయలేదు” అని తెలిపారు. పవన్ కల్యాణ్ వదులుకున్న ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి కథలు రవితేజ వద్దకు వెళ్లాయని, అవి రవితేజ కెరీర్‌కు చాలా ఉపయోగపడ్డాయని అన్నారు. నిజానికి మాస్ మహారాజా రవితేజ స్టార్ కాకముందు నుంచి తనకు మంచి మిత్రుడని చెప్పారు. తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడే రవితేజ కచ్చితంగా స్టార్ అవుతాడని నమ్మేవాడిని, ఆ టైంలోనే రవితేజకు తనతో సినిమా చేస్తానని చెప్పే వాడినని అన్నారు. కానీ రవితేజ తన మాటలు నమ్మలేదని, అయితే ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి కథలు రవితేజను ‘మాస్ మహారాజా’గా నిలబెట్టాయని గుర్తు చేశారు. ‘పోకిరి’ సినిమా విషయానికి వస్తే మహేష్ హీరోగా వచ్చిన ఈ సినిమా టాలీవుడ్‌లో ప్రత్యేక సెన్సేషన్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

READ ALSO: AI Dating Trend: ఏఐతో డేటింగ్.. న్యూయార్క్‌లో సంచలనం సృష్టిస్తున్న ఏఐ కేప్!

Exit mobile version