NTV Telugu Site icon

Raksha Bandhan: రక్షాబంధన్ రోజు సాలరీ కట్.. హక్కుల కోసం మాట్లాడితే ఉద్యోగం పోయింది..

Punjab Woman Fired, Salary Cut On Raksha Bandhan Leave

Punjab Woman Fired, Salary Cut On Raksha Bandhan Leave

Raksha Bandhan: రక్షాబంధన్ కోసం వెళ్లే ఉద్యోగుకు ఏడు రోజులు జీతాన్ని కట్ చేయాలన్న కంపెనీ బాస్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు ఓ మహిళ తన ఉద్యోగాన్ని కోల్పోయింది. ప్రస్తుతం పంజాబ్‌కి చెందిన మహిళ లింక్డ్‌ఇన్ పోస్ట్ వైరల్‌గా మారింది. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడిన హెచ్ఆర్ మహిళా ఉద్యోగిని కంపెనీ జాబ్ నుంచి తీసేసింది. తన పోస్టులో కంపెనీ విధానాన్ని ఆమె సవాల్ చేసింది. ఇది కార్మిక చట్టాలను ఉల్లంఘించడమే అని ఆరోపించింది. తన యజమానితో జరిగిన వాట్సాప్ సంభాషణలకు సంబంధించిన స్క్రీన్ షాట్లను పంచుకుంది. రెండు వారాల నోటీస్ పిరయడ్ లేకుండా తనను ఉద్యోగం నుంచి తీసేసినట్లు వెల్లడించింది.

Read Also: Physical Harassment: ట్యూషన్ కోసం వచ్చిన బాలికపై కన్నేసిన టీచర్.. అత్యాచారం

ఇదిలా ఉంటే, మహిళ ఆరోపణలపై సదరు కంపెనీ వేగంగా స్పందించింది. ఆమె వాదనల్ని ఖండించింది. ఆమె ఆరోపణలతో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పింది. ఆమె వ్యక్తిగత పనుల కోసం ఆఫీస్ వర్కింగ్ అవర్స్‌ని దుర్వినియోగం చేయడమే కాకుండా, సోషల్ మీడియా బాధ్యతల్ని విస్మరించిందని, పనితీరు సమస్యల కారణంగా ఆమెను తొలగించినట్లు కంపెనీ వాదించింది.

లింక్డ్‌ఇన్‌లో యూజర్లు మహిళకు మద్దతుగా నిలిచారు. చాలా మంది కంపెనీ చర్యల్ని విమర్శించారు. ఆమెకు పలువురు సలహాలు ఇచ్చారు. లేబర్ కోర్టులో కేసు దాఖలు చేయడం, తప్పుగా ఉద్యోగం నుంచి తొలగించినందుకు చట్టపరమైన నోటీసలు పంపడం వంటి చర్యల్ని సూచించారు. మరొకరు ఉద్యోగులంతా ఆమెకు సహకరించాలని కోరారు. ఆమెకు సంఘీభావంగా ఇతరులు రాజీనామా చేయాలని లేదా ప్రభుత్వం సంస్థకు ఫిర్యాదు చేయాలని సూచించారు.