Site icon NTV Telugu

PNB Recruitment 2026: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 5,138 పోస్టులు.. జస్ట్ డిగ్రీ ఉంటే చాలు..

Pnb

Pnb

బ్యాంకింగ్ సెక్టార్ లో కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా?అయితే మీకు గుడ్ న్యూస్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ భారీగా అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 5,138 అప్రెంటిస్‌షిప్ పోస్టులకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. వారు ఇతర అర్హత ప్రమాణాలను కూడా కలిగి ఉండాలి. అభ్యర్థులు కనీసం 20 సంవత్సరాలు, గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలి. జనవరి 1, 2026 నాటికి వయస్సును లెక్కిస్తారు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు కూడా అందుబాటులో ఉంటుంది.

Also Read:PM MODI: ‘‘ మలేషియా ప్రధాని ఎంజీఆర్‌కు పెద్ద అభిమాని’’.. మోడీ పర్యటనలో తమిళ సాంగ్..

జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ (పురుషులు) అభ్యర్థులకు రూ. 944, జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ (మహిళలు) అభ్యర్థులకు రూ. 708, ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ (పురుషులు/మహిళలు) అభ్యర్థులకు రూ. 236, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు రూ. 236 దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. ఎంపికైన అప్రెంటిస్‌లకు స్టైఫండ్‌ నెలకు గ్రామీణ / సెమీ అర్భన్ / అర్భన్ ప్రాంతాల్లో రూ.12,300, మెట్రో రూ.15,000 చెల్లిస్తారు. దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ఫిబ్రవరి 8 నుండి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 24, 2026. పూర్తి వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Exit mobile version