Mohali kabaddi Firing: పంజాబ్ మొహాలిలోని సోహ్నా ప్రాంతంలో జరుగుతున్న కబడ్డీ టోర్నమెంట్‌లో కాల్పుల కలకలం చెలరేగింది. కబడ్డీ మ్యాచ్ జరుగుతున్న సెక్టార్ 82 మైదానంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. పలు నివేదికల ప్రకారం.. ఈ కాల్పులకు పాల్పడిన వాళ్లు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపినట్లు తెలిపారు. కాల్పుల్లో ఒక కబడ్డీ ఆటగాడు, టోర్నమెంట్ నిర్వాహకుడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీళ్లిద్దరిని ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ నిర్వాహకుడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
READ ALSO: IND vs SA: టీ20 సిరీస్‌కు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్.. మరి బుమ్రా సంగతేంటి?
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఈ టోర్నమెంట్‌కు వచ్చిన చాలా మంది మొదట్లో ఆ కాల్పుల శబ్దాన్ని పటాకుల చప్పుడుగా భావించారని అన్నారు. నిజానికి మ్యాచ్ సమయంలో ప్రేక్షకుల మీదుగా దాదాపు ఆరు సార్లు కాల్పులకు పాల్పడినట్లు తెలిపారు. కబడ్డీ ఆటగాళ్ళు మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఈ కాల్పులు జరిగాయని అన్నారు. కాల్పుల తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. వాస్తవానికి ప్రముఖ గాయకుడు మన్కీర్ట్ ఔలాఖ్ కూడా ఈ టోర్నమెంట్‌కు హాజరు కావాల్సి ఉంది.
సోహానా పట్టణంలో బెడ్వాన్ స్పోర్ట్స్ క్లబ్ నాలుగు రోజుల కబడ్డీ టోర్నమెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ టోర్నమెంట్‌లో అనేక జట్లు పాల్గొంటున్నాయి. అయితే సోమవారం సాయంత్రం జరిగిన ఈ మ్యాచ్‌లో కాల్పులు జరిగాయి. నిర్వాహకుడు కన్వర్ దిగ్విజయ్ సింగ్, అలియాస్ రాణా బాలచౌరియా ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. దాడి చేసిన వాళ్లు రాణా బాలచౌరియాపై నేరుగా కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. సంఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ అధికారులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాణా బాలచౌరియా మరణించారు.
మొహాలీ ఎస్ఎస్పీ హర్మన్‌దీప్ సింగ్ మాట్లాడుతూ.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే నిందితుల కోసం వెతకడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు తెలిపారు. దాడి చేసిన వారిని గుర్తించడానికి కెమెరాల రికార్డింగ్‌లను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం నలుగురు నుంచి ఐదుగురు దుండగులు కాల్పులు జరిపారని అన్నారు.
READ ALSO: Zodiac Predictions 2026: ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో దరిద్రం దండిగా ఉంటుందట!
