Site icon NTV Telugu

PBKS vs RCB: ఐపీఎల్‌లో మరో ఆసక్తికర పోరు.. పంజాబ్‌ను బెంగళూరు ఓడించగలదా?

Pbks Vs Rcb

Pbks Vs Rcb

PBKS vs RCB: ఐపీఎల్‌-16లో గురువారం మరో ఆసక్తికర పోరు జరగనుంది. గురువారం పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్ పంజాబ్ హోమ్ గ్రౌండ్ మొహాలీలో జరగనుంది. ఈ మ్యాచ్ ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయపథంలోకి రావాలని కోరుకుంటోంది. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో బెంగళూరు జట్టు ఓటమి పాలైంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన శిఖర్ ధావన్ జట్టు ఉత్సాహంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొననుంది. రెండు జట్లలోనూ కీలకమైన ఆటగాళ్లు ఉన్నారు.

Read Also: IPL 2023: నేడు కోల్‌కతా వర్సెస్ ఢిల్లీ.. వార్నర్‌ సేన బోణీ కొట్టేనా?

ఐపీఎల్‌లో విజయంతో ప్రారంభించిన ఆర్సీబీ.. వరుస విజయాలను కొనసాగించడంలో విఫలమైంది. 16వ సీజన్‌లో బెంగళూరు జట్టు ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడగా, అందులో 2 గెలిచి, మూడు ఓడింది. 4 పాయింట్లతో ఆర్సీబీ జట్టు పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇదిలా ఉండగా.. పంజాబ్‌ జట్టు ప్రదర్శన అంత అద్భుతంగా ఏమీ లేదు. పంజాబ్ ఆడిన 5 మ్యాచ్‌ల్లో మూడింటిలో గెలిచి 2 ఓడిపోయింది. శిఖర్ ధావన్ జట్టు 6 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన గత 6 మ్యాచ్‌ల ఫలితాలు చూస్తే.. ఆర్‌సీబీపై పంజాబ్‌కు బలమైన రికార్డు ఉంది. బెంగళూరుతో జరిగిన గత 6 మ్యాచ్‌ల్లో పంజాబ్ 5 గెలిచింది.

పంజాబ్ జట్టు (అంచనా): శిఖర్ ధావన్ (C), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, మాట్ షార్ట్, హర్‌ప్రీత్ సింగ్, సికందర్ రజా, సామ్ కర్రాన్, జితేష్ శర్మ, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్.

బెంగళూరు జట్టు (అంచనా): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (C), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (WK), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్

Exit mobile version