NTV Telugu Site icon

IPL 2024: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్

Pbks Vs Mi

Pbks Vs Mi

Punjab Kings: ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడబోతుంది. చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇక, పాయింట్ల పట్టికలో ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో ఉన్న పంజాబ్, ముంబై టీమ్స్ ఈ మ్యాచ్ లో విజయం తప్పనిసరి అయింది. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌లలో ఇరు జట్లూ రెండు విజయాలను నమోదు చేశాయి. ఇక, ఈ మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా రెండు టీమ్స్ బరిలోకి దిగుతున్నాయి. అయితే, పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. అంటే, తొలుత ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్ కు దిగనుంది. ఇక, ప్లేఆఫ్ పరంగా ఈ మ్యాచ్ పంజాబ్- ముంబై జట్లకు చాలా కీలకం కానుంది. అలాగే, ఐపీఎల్‌లో ఇరు జట్లు 31 సార్లు తలపడగా.. ముంబై ఇండియన్స్ 16 సార్లు, పంజాబ్ కింగ్స్ 15 సార్లు విజయం సాధించాయి.

Read Also: Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’ను చుట్టేసి అయోధ్య రామయ్య దగ్గరకు హరీష్ అండ్ కో

తుది జట్లు:
పంజాబ్ కింగ్స్: రిలీ రోసౌవ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్ ( కెప్టెన్ ), జితేష్ శర్మ( వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌ స్టోన్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్. ఇంపాక్ట్ ప్లేయర్స్: ఆకాష్ మధ్వల్, నువాన్ తుషార, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, నమన్ ధీర్.

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్( వికెట్ కీపర్), సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ( కెప్టెన్ ), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మహ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా. ఇంపాక్ట్ ప్లేయర్స్: రాహుల్ చాహర్, విధ్వత్ కావరప్ప, హర్‌ప్రీత్ భాటియా, శివమ్ సింగ్, రిషి ధావన్.