Site icon NTV Telugu

Viral Video: జియోమెట్రీ బాక్స్‌తో అద్భుతం సృష్టించిన పిల్లలు

Viral

Viral

Viral Video: సామాజిక మాధ్యమాల్లో తరచూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు మనకు ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. పుణే నగరానికి చెందిన కొంతమంది స్కూల్ విద్యార్థులు తమ సృజనాత్మకతను చూపిస్తూ రూపొందించిన ఒక చిన్న వీడియో తాజాగా ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. సామాన్య వస్తువులను వినియోగించి సూపర్ బీట్‌లను తయారు చేసిన తీరు ఇప్పుడు నెటిజన్లను కట్టిపడేశారు. ఈ ఘటనకు సంబంధించి తాజాగా ఓ వీడియో నెత్తిన తెగ వైరల్ అవుతోంది.

Read Also: SLBC: కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. సాయంత్రానికి రెండు డెడ్ బాడీస్..!

ఈ వైరల్ వీడియోలో విద్యార్థులు ఎటువంటి ప్రత్యేకమైన సంగీత సాధనాలను ఉపయోగించకుండా.. వారి చేతిలో ఉన్న జియోమెట్రీ బాక్స్, బెంచ్, వాటర్ బాటిల్ వంటి సాధారణ వస్తువులను సంగీత సాధనాలుగా మార్చి, అద్భుతమైన రిధమ్‌ను సృష్టించారు. వారు చూపిన సమన్వయం, ప్రదర్శించిన టాలెంట్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచింది. విద్యార్థుల సంగీత ప్రదర్శనను చూసిన టీచర్లు ఎంతో ఆనందించారు. వారు విద్యార్థులకు ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా, వారి టాలెంట్‌ను ప్రశంసించారు.

Read Also: AI Movie: మొదటి భారతీయ ‘ఏఐ’ మూవీ పరిచయం చేసిన చిత్రబృందం.

ఇక విద్యార్థుల ప్రతిభకు నెటిజన్లు కూడా ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపించారు. విద్యార్థులు అద్భుతం సృష్టించారని కొందరు కామెంట్ చేస్తుండగా.. మరికొందరు ఇదే నిజమైన టాలెంట్ అంటూ పలువురు నెటిజన్స్ ప్రశంసలు గుప్పించారు. ఇక వీరి ప్రతిభను చూసిన మరికొంత మంది సంగీత ప్రియులు, ఈ విద్యార్థులకు ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇస్తే ఇంకా గొప్ప స్థాయికి వెళ్తారని అభిప్రాయపడుతున్నారు. పుణే స్కూల్ విద్యార్థుల ఈ చిన్న వీడియో వారిని దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడమే కాకుండా, వారి సంగీత ప్రయాణానికి ఒక మంచి దారి చూపించిందని చెప్పవచ్చు.

Exit mobile version