Site icon NTV Telugu

Pune Porsche car crash: పూణె పోలీస్ పోర్షే కారు ప్రమాదంలో కొత్త ట్విస్ట్.. మైనర్ తల్లి అరెస్ట్!

Pune Porsh

Pune Porsh

Pune Porsche Car Accident Case: పూణె పోలీస్ పోర్షే కారు ప్రమాదంలో కొత్త ట్విస్ట్ బయటపడింది. పోర్షే కారు ప్రమాదం కేసులో యువకుడి రక్త నమూనాలను అతని తల్లితో మార్చుకున్నట్లు నిర్ధారించిన తర్వాత పూణె పోలీసులు యువకుడి తల్లిని సైతం అరెస్టు చేశారు. ఈ మేరకు నగర పోలీసు ఉన్నతాధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రమాదంపై దర్యాప్తులో యువకుడి రక్త నమూనాలను అతని తల్లికి మార్చినట్లు తేలిందని పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు.

Read Also: Viswak Sen : ఛాలెంజింగ్ అనిపిస్తే ఎలాంటి పాత్ర అయినా చేస్తా..

ఇక, ఈ కేసును విచారించిన విచారణ కమిటీ నిందితుడి రక్త నమూనా స్థానంలో తల్లి రక్త నమూనాను తీసుకున్నట్లు తేలింది. బ్లడ్ శాంపిల్ మార్చేందుకు నిందితుడి కుటుంబీకులు వైద్యులకు కేవలం రూ.3 లక్షలు మాత్రమే లంచం ఇచ్చినట్లు సమాచారం. బాలుడి రక్త నమూనాను తల్లి రక్త నమూనాలో మార్చేసి ఉండొచ్చని క్రైం బ్రాంచ్ అధికారులు అనుమానిస్తున్నారు. అలాగే, ప్రమాదం జరిగిన రోజు రాత్రి, పోర్షే కారులో నిందితుడితో కూర్చున్న అతని స్నేహితులు ప్రమాద సమయంలో అతను తాగి ఉన్నాడని శుక్రవారం పోలీసులకు వెల్లడించారు. ఇక, మద్యం మత్తులో రోడ్డుపై గంటకు 200 కిలో మీటర్ల వేగంతో కారు నడిపినట్లు వాళ్లు తెలిపారు.

Exit mobile version