పూణే జిల్లాలో దారుణ జరిగింది. ఓ చిన్నారిపై దాడి చేసింది. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పూణే జిల్లాలోని మానవ-చిరుతపులి సంఘర్షణకు కేంద్రంగా ఉన్న శిరూర్ తహసీల్‌లోని పింపార్ఖేడ్ గ్రామంలో చిరుతపులి దాడిలో శివన్య బొంబే అనే ఐదేళ్ల బాలిక మరణించింది.
Read Also:Non-Veg Party in School: స్కూల్లో చికెన్, మటన్ తోని దావత్.. ప్రిన్సిపాల్ సస్పెన్షన్…
ఈ సంఘటన అక్టోబర్ 12న ఉదయం 10 గంటల ప్రాంతంలో జరిగింది. శివన్య మామ గణేష్ బొంబే ఇలా గుర్తుచేసుకున్నాడు, “తన మేనకోడలు తాత అరుణ్ బొంబే కోసం నీళ్లు, టోపీ తీసుకెళ్తుందని శివన్య మేనమామ అయిన గణేష్ బోంబే తెలిపాడు. ఆయన మా ఇంటి వెనుక కేవలం 200 మీటర్ల దూరంలో పొలంలో పనిచేస్తున్నారు. సమీపంలోని చెరకు తోటలో దాక్కున్న చిరుత అకస్మాత్తుగా బయటకు దూకి చిన్నారిపై దాడి చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆ చిన్నారి మెడ పట్టుకుని దట్టమైన పొలంలోకి లాగడానికి ప్రయత్నించింది. శివన్య అరుపు విన్న ఆమె తాత చిరుతపులి వైపు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెను కాపాడటానికి తీవ్రంగా పోరాడని వెల్లడించారు. అటవీ అధికారులకు వెంటనే సమాచారం అందించగా, పరిస్థితిని పరిశీలించడానికి ఒక బృందం అక్కడికి చేరుకుంది. చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Read Also:Women Cricketers : బుర్ఖా ధరించి క్రికెట్ పిచ్ లోకి మహిళా క్రికెటర్లు..
“బాలిక శరీరం నుండి స్వాబ్ నమూనాలను సేకరించి, పరీక్ష కోసం హైదరాబాద్‌లోని ప్రయోగశాలకు పంపామని శిరూర్ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ నీలకాంత్ గవ్హానే తెలిపారు. జంతువును పట్టుకోవడానికి ఆ స్థలంలో చుట్టుపక్కల 11 బోనులను ఏర్పాటు చేస్తున్నామని… ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి కెమెరా ట్రాప్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. బాధితుడి కుటుంబానికి త్వరలో పరిహారం అందించబడుతుందని ఆయన చెప్పుకొచ్చారు.. ఈ సంఘటన ఆ ప్రాంతంలో భయానక వాతావరణాన్ని సృష్టించింది. చిరుతపులిదాడి భయబ్రాంతులకు గురైన ప్రజలను ఆందోళన వ్యక్తం చేశారు. చిరుతను వెంటనే బోనులో బంధించాలని అటవీ శాఖను డిమాండ్ చేశారు.
