Site icon NTV Telugu

Police Arrested: ప్రాణాంతక స్టంట్ చేసిన ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు..

Police Arested

Police Arested

Police Arrested For Viral Video: శిథిలావస్థలో ఉన్న ఓ ఆలయ భవనం పై రీల్స్ కోసం సాహసోపేతమైన రీల్ చేసినందుకు పూణే నగరంలోని భారతి విద్యాపీఠ్ పోలీసు స్టేషన్‌లో ఒక అమ్మాయి, పురుషుడిని అరెస్టు చేసినట్లు శుక్రవారం ఒక పోలీసు అధికారి తెలిపారు. వారిని మిహిర్ గాంధీ (27), అతని స్నేహితురాలు మినాక్షి సలుంఖే (23)గా గుర్తించగా.. రీల్‌ ను చిత్రీకరిస్తున్న మూడో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఈ విషయం సంబంధించి భారతీ విద్యాపీఠ్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ దశరత్ పాటిల్ మాట్లాడుతూ.. మాకు వీడియో గురించి సమాచారం వచ్చిన తర్వాత, మేము వారికోసం వేట ప్రారంభించామని, చివరికి వారిని కనుగొనమన్నారు. గురువారం అర్థరాత్రి వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా మేము వారిపై ఐపీసీ సెక్షన్ 336 అలాగే మరికొన్ని ఇతరాల అభియోగాలు కింద కేసు బుక్ చేయునట్లు తెలిపారు.

Honey Moon Express Review: హెబ్బా పటేల్ హనీ మూన్ ఎక్స్‌ప్రెస్ మూవీ రివ్యూ

అయితే, ఈ నేరంలో అమ్మాయి మైనర్ అయినందున ఆరు నెలల కంటే తక్కువ జైలు శిక్షతో పాటు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉన్నందున వారిని కస్టడీకి రిమాండ్ చేయబోమని పాటిల్ తెలిపారు. ఇక ఆ అమ్మాయి చేసిన స్టంట్ కి దేశ ప్రజలు ఆశ్చర్యపోయారు. గాంధీ ఆలయ పైకప్పు అంచున పడి ఉండటం వీడియోలో కనిపించింది. ఆ అమ్మాయి వ్యక్తి చేయి పట్టుకుని కనీసం 10 అంతస్తుల భవనంతో సమానమైన ఎత్తు నుండి గాలిలో వేలాడుతూ కనిపించింది. ఆ భవనం దిగువన ఉన్న లోతును కూడా ఆ వీడియోలో మనం చూడవచ్చు. ఒకవేళ ఆమె పట్టు జారినట్లయితే, సమీపంలోని రహదారిపై వేగంగా వాహనాలు తిరుగుతున్నందున ఆమె ప్రాణాలు ఖచ్చితంగా గాలిలో కలిసిపోయేవి.

Sania Mirza Marriage: టీమిండియా క్రికెటర్‌తో పెళ్లి.. స్పందించిన సానియా మీర్జా తండ్రి!

త్వరగా వైరల్ అయిన ఆ రీల్, వారి ప్రాణాలను రిస్క్ లో పెట్టుకోవడమే కాకుండా.. ఇతరులకు, ముఖ్యంగా యువకులకు చెడ్డ ఉదాహరణగా నిలిచినందుకు సోషల్ మీడియాలో వీరికి కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేసిన అనేక కామెంట్స్ వచ్చాయి . ఇక ఈ ఘటనలో మొబైల్‌లో రీల్‌ ను షూట్ చేస్తున్న మూడో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారని, త్వరలో పట్టుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Exit mobile version