Site icon NTV Telugu

Noida: రెస్టారెంట్లో సర్వీస్ చార్జ్ రూ.970.. తుక్కు తుక్కుగా కొట్టుకున్న కస్టమర్లు, సిబ్బంది

Scuffle

Scuffle

Noida: మనం ఎప్పుడైనా రెస్టారెంట్ కి వెళితే అక్కడ సర్వీస్ చార్జ్ వేస్తుంటారు. మామూలుగా సర్వీస్ చార్జ్ మా అంటే 100లోపే ఉంటుంది. కానీ ఓ రెస్టారెంట్లో ఏకంగా రూ.970 సర్వీస్‌ ఛార్జీ విధించారు. దీనిపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీస్ చార్జ్ తొలగించమని అడినందుకు వాగ్వాదం చెలరేగి కస్టమర్లు, సిబ్బంది పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది.

ఆదివారం సాయంత్రం సెక్టార్‌ 75లో ఉన్న స్పెక్ట్రమ్ మాల్‌లోని డ్యూటీ ఫ్రీ రెస్టారెంట్‌కు సుమారు డజను మంది ఉన్న కుటుంబం వెళ్లింది. భోజనం చేసిన తర్వాత బిల్లు చూసి కంగుతిన్నారు. బిల్లులో రూ.970 సర్వీస్‌ ఛార్జ్‌ విధించారు. ఆ కుటుంబ సభ్యులు ఆభ్యంతరం వ్యక్తం చేశారు. సిబ్బంది సరిగా స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా విధించిన సర్వీస్‌ ఛార్జ్‌ను బిల్లు నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

Read Also:Guntur Kaaram : సినిమాకే హైలైట్ గా నిలవనున్న ఆ సీన్…?

రెస్టారెంట్‌ యాజమాన్యం సరేమీరా నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం కాస్త ఫైటింగ్ కు దారితీసింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు, రెస్టారెంట్‌ సిబ్బంది తిట్టుకోవడంతోపాటు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. ఈ వీడియో క్లిప్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఆ రెస్టారెంట్‌కు చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని అదుపు చేశారు. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వేర్వేరుగా రెండు కేసులు నమోదు చేశారు.

Read Also:Bhatti Vikramarka : కృష్ణా జలాలు రాకుండా అడ్డుపడింది బీఆర్‌ఎస్‌ పార్టీనే

Exit mobile version