NTV Telugu Site icon

Virat Kohli: ఇష్టమైన ఫుడ్ దొరికింది.. కోహ్లీ కాక కుమ్మేస్తాడు పో!

13

13

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడన్న విషయం తెలిసిందే. అంతమాత్రాన సొంత ఊరుకు వెళ్లి మనకు నచ్చిన ఫుడ్ తినకపోతే ఎలా! ఇప్పుడు కోహ్లీ కూడా అదే చేశాడు. కోహ్లీ ఫేవరెట్ ఫుడ్‌ ఏంటో అందరికి తెలిసే ఉంటుంది. నార్త్‌ ఇండియాలో మాత్రమే దొరికే చోలే బటురే(రోటి, శనగల కూర).ఈ కాంబినేషన్ అంటే కోహ్లీకి అమితమైన ‍ప్రేమ. మీకు అనుమానంగా ఉంటే గూగుల్‌లో కోహ్లీకి ఇష్టమైన ఫుడ్ ఏంటి అని వెతికితే కనిపించే పేరు చోలే బటురే. ఈ వంటకం తింటే తనకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుందని కోహ్లీ కూడా చాలాసార్లు పేర్కొన్నాడు. తాజాగా దానిని మరోసారి నిరూపించాడు విరాట్.

Also Read: Bad Mood : మీ మూడ్ బాగోట్లేదా.. అయితే రోజూ ఇలా చేయండి

ఆస్ట్రేలియాతో ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బ్యాటింగ్‌ సమయంలో కోహ్లీ, కోచ్‌ ద్రవిడ్‌ డ్రెస్సింగ్‌రూమ్‌ బయట కూర్చొని ఏదో విషయమై సీరియస్‌గా చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో కోహ్లీ వద్దకు టీమిండియా సపోర్ట్‌ స్టాఫ్‌ ఒకరు వచ్చారు. విరాట్ మాట్లాడుతుండగా పిలిచి చేతిలో ఉన్న చోలే బటురేను చూపించాడు. అంతే అప్పటివరకు సీరియస్‌గా ఉన్న కోహ్లీ మూడ్‌ మొత్తం మారిపోయింది. కూర్చొన్న సీటులో నుంచే తనకిష్టమైన చోలే బటురేను చూసి క్లాప్స్‌ కొడుతూ.. సూపర్‌.. అక్కడ పెట్టండి వచ్చి తింటా అన్నట్లుగా రియాక్షన్‌ ఇచ్చాడు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు కోహ్లీకి చోలే బటురే అంటే ఎంత ఇష్టమో. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన క్రికెట్‌ అభిమానులు తమకు తోచిన రీతిలో కామెంట్లు పెట్టారు. ”ఇష్టమైన ఫుడ్ కంటపడింది.. కోహ్లీ ఇరగదీయడం ఖాయం.. చోలే బటురే చూస్తే చాలు కోహ్లీలో ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది.”.. ”తొలి ఇన్నింగ్స్‌లో మిస్‌ అయిన హాఫ్‌ సెంచరీని.. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో కవర్‌ చేస్తాడు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక తొలి టెస్టులో విఫలమైన కోహ్లీ రెండో టెస్టులో మాత్రం పర్వాలేదనిపించాడు. 44 పరుగులు చేసి వెనుదిరిగిన కోహ్లీ అర్థసెంచరీ మార్క్‌ను మిస్‌ అయ్యాడు. అయితే కోహ్లీ ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. భారత్‌ ఇన్నింగ్స్‌ 50 ఓవర్‌ వేసిన కునేమన్ బౌలింగ్‌లో విరాట్‌ డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్‌కు దగ్గరగా వెళ్తూ కోహ్లి ప్యాడ్‌ను తాకింది. అంపైర్‌ ఔట్‌ ఇవ్వడంతో కోహ్లీ డీఆర్‌ఎస్ తీసుకున్నాడు. టీవీ రిప్లైలో బంతి బ్యాట్‌కు ముందుగా తగులుతున్నట్లు స్పష్టంగా కనిపించినా.. థర్డ్ అంపైర్ మాత్రం బెన్‌ఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. అంపైర్‌ నిర్ణయాన్ని స్క్రీన్‌పై చూసిన కోహ్లీ కూడా ఒక్క సారిగా షాక్‌కు గురయ్యాడు.

Also Read: Nikki Yadav Case: రెండో పెళ్లి వద్దన్నందుకే హత్య.. అంతకు ముందే నిక్కీ-సాహిల్ పెళ్లి