Site icon NTV Telugu

Pulivendula: “కాల్చిపారేస్తా”.. వైసీపీ కార్యకర్తలకు డీఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్‌..

Ycp

Ycp

Pulivendula ZPTC By-Election Tensions: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికార టీడీపీ, వైసీపీ నాయకులు మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా హీట్ పెరిగింది. తాజాగా వైసీపీ కార్యాలయానికి వచ్చిన కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డిని ఆఫీసులోనే నిర్బంధించారు. ఇది తెలిసిన వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పోలీసులు వాళ్లను పంపించే ప్రయత్నం చేశారు. పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో డీఎస్పీ కార్యక్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఎక్కువ చేస్తే కాల్చిపారేస్తా.. నా కొడకా.. నువ్వు తాగి మాట్లాడుతుండొచ్చు.. కానీ యూనిఫాం ఉందిక్కడ.” అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

READ MORE: Ambati Rambabu: “దొంగ ఓట్లు వేసిన వాళ్ళ పేర్లతో సహా”.. ఉప ఎన్నికలపై అంబటి సంచలన వ్యాఖ్యలు..

 

Exit mobile version