తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో కీలక అంశాలు బయటకు రానున్నాయి. డ్రగ్స్ కేస్ లో ఇద్దరు నిందితులైన అభిషేక్, అనిల్ మొదటి రోజు కస్టడీ విచారణ పూర్తిచేశారు బంజారాహిల్స్ పోలీసులు. పబ్ మేనేజర్ అనిల్, పార్టనర్ అభిషేక్ లను విచారణ చేశారు పోలీసులు. ఆరు గంటలు విడివిడిగా ఇద్దరిని విచారణ చేశారు పోలీసులు. అనిల్, అభిషేక్ ల వ్యక్తి గత సమాచారం సేకరించిన పోలీసులు. వాటి గురించి ఆరా తీశారు. అనిల్ , అభిషేక్ వద్ద సీజ్ చేసిన ఫోన్స్ డేటా వివరాల ఆధారంగా దర్యాప్తు సాగుతోంది.
పబ్ పార్టనర్స్ , అగ్రిమెంట్స్ పై విచారణలో పలు అంశాలు కూపీలాగారు. పబ్ లో దొరికిన డ్రగ్స్ పై అనిల్ ను ప్రశ్నించిన పోలీసులు పలు విషయాలు రాబట్టారని తెలుస్తోంది. అభిషేక్ CDR లిస్ట్ ప్రకారం దర్యాప్తు అధికారుల ప్రశ్నలు సంధించారు. పబ్ కు అట్టెండ్ అయిన కష్టమర్ల వివరాలపై అభిషేక్ ను ప్రశ్నించారు పోలీసులు.
Read Also: KTR: దళితబంధుని కూడా కాపీ కొడతారేమో!
ఇప్పటికే గుర్తించిన 10 మంది డ్రగ్స్ పెడలర్ల కోణంలో విచారణ చేశారు పోలీసులు. ఈవిచారణలో నలుగురు ఇన్ స్పెక్టర్లు, ఏసీపీ సమక్షంలో దర్యాప్తు సాగించారు. అయితే, పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు నోరు మెదపలేదు అనిల్, అభిషేక్. వీరిచ్చే వివరాలపై మరి కొంతమందికి నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. ఇద్దరి స్టేట్ మెంట్ ఆధారంగా షాంపుల్స్ సేకరణ పై క్లారిటీ రానుంది.
