NTV Telugu Site icon

Bank FD Scheme: 7.55% వడ్డీ రేటుతో అదిరిపోయే ఎఫ్‭డి స్కీములను తీసుకొచ్చిన ఇండియన్ బ్యాంకు

Fd

Fd

Bank FD Scheme: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ కస్టమర్లకు 2 ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను అందిస్తోంది. వినియోగదారులు 30 నవంబర్ 2024 వరకు ఈ ప్రయోజనాలను పొందవచ్చు. దీని తర్వాత FD పథకం నిలిపివేయబడుతుంది. ఇక ఈ స్కీమ్‌ల పేర్లు చుస్తే ఇండ్ సుప్రీం (IND Supreme), ఇండ్ సూపర్ (IND Super) ఎఫ్‌డి స్కీమ్. ఇందులో ఇండ్ సుప్రీం పథకం వ్యవధి 300 రోజులు. దీనిపై, సాధారణ పౌరులు 7.05% రాబడిని పొందుతారు. అదే సమయంలో, బ్యాంక్ 400 రోజుల ఇండ్ సూపర్ ఎఫ్‌డి ప్లాన్‌పై 7.30% వడ్డీని అందిస్తోంది. సమాచారం కోసం, ఈ ప్రభుత్వ బ్యాంకు సాధారణ FDపై 2.80% నుండి 7.10% వడ్డీని అందిస్తోంది.

Also Read: Laggam time: “లగ్గం టైమ్‌” ఫస్ట్‌లుక్ లాంచ్ చేసిన ‘భీమ్లా నాయక్’ డైరెక్టర్

సాధారణ పౌరులు 300 రోజుల ఇండ్ సుప్రీం FD పథకంపై సంవత్సరానికి 7.05% వడ్డీని పొందుతున్నారు. సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు 7.55%, అలాగే సూపర్ సీనియర్ సిటిజన్లకు ఇది 7.80% గా వడ్డీ ఇవ్వనున్నారు. 400 రోజుల ఇండ్ సూపర్ ఎఫ్‌డి పథకంపై, సీనియర్ సిటిజన్‌లకు 7.80% వడ్డీ, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 8.05% వడ్డీ లభిస్తోంది. ఇండ్ సుప్రీంలో కస్టమర్లు రూ.5 వేల నుంచి రూ.3 కోట్ల లోపు పెట్టుబడి పెట్టవచ్చు. ఇండ్ సూపర్‌లో కనీసం రూ.10 వేలు, గరిష్టంగా రూ.3 కోట్ల లోపు పెట్టుబడి పెట్టవచ్చు.

Also Read: Kiran Abbavaram : ‘క’ ఓటీటీ రిలీజ్ పై వాళ్లు అలా.. నిర్మాత ఇలా..

ప్రస్తుతం కాలవ్యవధి ప్రకారం ఎఫ్‭డి వడ్డీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి.

* 7 నుండి 14 రోజులు- 2.80%
* 15 నుండి 29 రోజులు- 2.80%
* 30 నుండి 45 రోజులు- 3%
* 46 నుండి 90 రోజులు- 3.25%
* 91 నుండి 120 రోజులు- 3.5%
* 121 నుండి 180 రోజులు- 3.85%
* 181 రోజుల నుండి 9 నెలల కంటే తక్కువ – 4.50%
* 9 నెలల నుండి 1 సంవత్సరం కంటే తక్కువ – 4.75%
* 300 రోజులు (సుప్రీం ఉత్పత్తిలో)- 7.05%
* 1 సంవత్సరం- 6.10%
* 400 రోజులు (సూపర్ ఉత్పత్తిలో)- 7.30%
* 1 సంవత్సరం కంటే ఎక్కువ మరియు 2 సంవత్సరాల కంటే తక్కువ – 7.10%
* 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కంటే తక్కువ – 6.70%
* 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల కంటే తక్కువ – 6.25%
* 5 సంవత్సరాలు – 6.25%
* 5 సంవత్సరాల కంటే ఎక్కువ – 6.10%