Site icon NTV Telugu

Banking Charges: సర్వీస్ ఛార్జ్ – పెనాల్టీ పేరుతో ఐదేళ్లలో బ్యాంకులు ఎన్ని వేల కోట్లు వసూలు చేశాయో తెలుసా?

Banks

Banks

Banking Charges: ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ ఖాతాదారుల నుంచి గడిచిన ఐదేళ్లలో సర్వీస్ ఛార్జ్ – పెనాల్టీ పేరుతో రూ. 35,587 కోట్లను వసూలు చేశాయి. ఖాతాలలో కనీస నిల్వను నిర్వహించకపోవడం, అదనపు ఏటీఎం లావాదేవీలు, ఎస్ఎంఎస్ సేవల పేరుతో బ్యాంకులు పెద్దమొత్తంలో నగదును రికవరీ చేశాయి. ఈ విషయాన్ని ప్రభుత్వమే పార్లమెంట్‌లో వెల్లడించింది. ప్రశ్నోత్తరాల సమయంలో రాజ్యసభ ఎంపీ అమీ యాగ్నిక్ అడిగిన ప్రశ్నలకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ సమాధానమిచ్చారు. బ్యాంకు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయనందుకు బ్యాంకులు గరిష్టంగా పెనాల్టీ వసూలు చేశాయని చెప్పారు. 2018 తర్వాత మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించనందుకు బ్యాంకులు రూ.21,044.04 కోట్లను రికవరీ చేశాయి. అకౌంట్ హోల్డర్ల ఫిక్స్‌డ్ ఫ్రీ లావాదేవీలే కాకుండా ఏటీఎంలలో అదనపు లావాదేవీలు చేసినందుకు రూ.8289.32 కోట్లు రికవరీ అయింది. ఎస్ఎంఎస్ సేవలను అందించడానికి బదులుగా బ్యాంకులు రూ.6254.32 కోట్లను రికవరీ చేశాయి.

Read Also:Lottery: జాక్ పాట్.. లాటరీలో రూ.13వేల కోట్లు గెలుచుకున్నాడు..

పేదలకు భరించలేని విధంగా బ్యాంకులు సర్వీసు చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ ఛార్జీలపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆర్థికమంత్రిని అడిగారు. బ్యాంకుల సర్వీస్‌ చార్జీలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఏం చేసింది? .. అన్న ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి సమాధానమిస్తూ, దేశంలోని పేద వర్గాలకు బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం, ఆర్‌బిఐ అనేక చర్యలు తీసుకున్నాయని చెప్పారు. ప్రాథమిక సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా (BSBDA) దీనిలో ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన కింద తెరిచిన ఖాతాలపై ఎటువంటి ఛార్జీలు విధించబడవు. ఈ ఖాతాలలో కనీస నిల్వను నిర్వహించాల్సిన అవసరం లేదు. 2015 జూలై 1న బ్యాంకులో కస్టమర్ సేవలకు సంబంధించి ఆర్‌బీఐ మాస్టర్ సర్క్యులర్‌లో బోర్డు ఆమోదించిన పాలసీ ప్రకారం ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచుకోనందుకు బ్యాంకులు పెనాల్టీ విధించే అవకాశం ఉందని చెప్పినట్లు భగవత్ కరద్ తెలిపారు. జూన్ 10, 2021న, ఆర్బీఐ తన సర్క్యులర్‌లో బ్యాంక్ కస్టమర్లు తమ బ్యాంక్ ఏటీఎంలలో ప్రతి నెలా ఐదు లావాదేవీలను ఉచితంగా చేసుకోవచ్చని పేర్కొంది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో నగరాల్లో 3 , నాన్-మెట్రో నగరాల్లో 5 ఉచిత లావాదేవీలు అనుమతించబడతాయి. జనవరి 1, 2022 నుండి ప్రతి అదనపు ATM లావాదేవీకి రూ. 21 కస్టమర్ ఛార్జీ వసూలు చేయబడుతుంది.

Read Also:Rajini: వీకెండ్ కాదు, పండగ లేదు… సెలబ్రేషన్ మాత్రం పీక్స్ లో ఉంది

Exit mobile version